కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజాస్వామ్యాన్ని కాలరాసే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మమత మంగళవారం ఓ కొత్త నోటీసు జారీ చేశారు. ప్రభుత్వ సంస్థలు, గ్రంథాలయాలలో అన్ని పత్రికలు చదవద్దని సర్క్యులర్ జారీ చేశారు. గ్రంథాలయాలు, ప్రభుత్వ సంస్థలు సర్క్యులర్‌లో పేర్కొన్న ఎనిమిది పత్రికలను మాత్రమే చదవాలని మంగళవారం జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. విచిత్రంగా ప్రముఖ పత్రికల పేర్లను ఆమె అందులో పేర్కొనలేదు. ఆమె నోటీసుపై పశ్చిమ బెంగాల్ యావత్తు నివ్వెరపోయింది. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఎక్కువగా చదివే ఆనంద బజార్ పత్రికను కూడా ఆమె నిషేధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
నిష్పక్షపాతంగా ఉన్న పత్రికలనే చదవాలని సర్క్యులర్‌లో మమత పేర్కొన్నారు. పలు రాజకీయ పార్టీలు పబ్లిష్ చేసే వివిధ పత్రికల కోసం ప్రభుత్వం డబ్బులను కేటాయించేందుకు సిద్ధంగా లేదని చెప్పారు. అయితే మమతా బెనర్జీ నోటీసులపై విపక్షాలు మండిపడుతున్నాయి. మమత తీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలోని 2400 గ్రంథాలయాలలో పలు జాతీయ, రాష్ట్ర పత్రికలను మమత బహిష్కరించడం పట్ల సిపిఎం మండిపడింది.
West Bengal Chief Minister seems to be all set to root out democracy from the state. Mamata Banerjee issued a notice on Tuesday, Mar 28 saying that the state and state-aide libraries can purchase only eight newspapers whose names have been enlisted in the circular.
Story first published: Wednesday, March 28, 2012, 15:32 [IST]