జగన్ కేసు: మంత్రులకు అందిన సుప్రీం నోటీసులు

నోటీసులు అందిన వెంటనే మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. నోటీసులపై తమ కార్యాచరణకు సంబంధించి వారు ముఖ్యమంత్రితో చర్చించారు. నోటీసులో తాము ఇంకా చూడలేదని, చూసిన తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకుంటామని మంత్రి కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. తాము ఆరుగురు మంత్రులం కలిసే ఏం చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రితో కలిసి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంత్రులు అంటున్నారు.
వైయస్ జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు, ఎనిమిది మంత్రులకు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులను బర్తరఫ్ చేయాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది.












Click it and Unblock the Notifications