చిరుకు సత్తా లేదు: హరిరామజోగయ్య, జగన్‌కు కితాబు

ప్రస్తుత రాజకీయాల్లో నీతిమంతులు ఎవరూ లేరన్నారు. నీతి, అవినీతిని ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. వారు సమర్థవంతమైన నాయకుడిని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ కారణంతో అక్కడి నేతలు రాజీనామా చేసినందు వల్లే జగన్ తన పార్టీ తరఫున అక్కడ అభ్యర్థులను నిలబెట్టలేదని చెప్పారు. కాబోయే సిఎం జగనే అన్నారు. ఏ పార్టీలోనూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వంటి వ్యక్తి లేరన్నారు. జగన్‌కు మంచి ఆదరణ ఉందన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే గెలుపన్నారు. కాగా హరిరామజోగయ్య ఆదివారం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది.