తెలంగాణ కోసం మరో ఆత్మహత్య, శ్రీకాంత్ మృతి

హైదరాబాదు శివారులోని ఎన్టీఆర్ నగర్‌లో బుధవారం ఆత్మహత్యా యత్నం చేసుకున్న శ్రీకాంత్ మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. తెలంగాణ కోసం ఆత్మహత్యా యత్నానికి దిగిన శ్రీకాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. శుక్రవారం రాత్రి అతను మరణించాడు. ఇదిలావుంటే, తెలంగాణ సాధన కోసం మరో యువకుడు ఆత్మహత్యా యత్నానికి దిగాడు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండప్రోల్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం బండావత్ సురేష్ (30) అనే యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలను అదుపు చేయడానికి భార్య కళావతి ప్రయత్నించింది. అతను మిర్యాలగుడా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.