హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిబిఐ చార్జిషీట్: తొలి నిందితుడిగా వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఐఎఎస్ అధికారి బిపి ఆచార్యను కూడా నిందితుడిగా చేర్చింది. ఎమ్మార్ కుంభకోణం కేసులో కూడా బిపి ఆచార్య నిందితుడు అనే విషయం తెలిసిందే. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో 13 మంది పేర్లను నిందితులుగా చేర్చింది. ఈ కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డిని మొదటి నిందితుడిగా చేర్చారు. రెండో నిందితుడిగా జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయిరెడ్డిని చేర్చింది.

అరవిందో ఫార్మాను 3వ ముద్దాయిగా, నాలుగో ముద్దాయిగా హెటిరో డ్రగ్స్‌ను సిబిఐ చేర్చింది. ఐదో ముద్దాయిగా ట్రిడెంట్‌ను చేర్చింది. ఆరో నిందితుడిగా శ్రీనివాస రెడ్డిని, ఏడో నిందితుడిగా నిత్యానంద రెడ్డిని చేర్చింది. ఎనిమిదో నిందితుడిగా శరత్ చంద్రా రెడ్డి, తొమ్మిది నిందితుడిగా బిపి ఆచార్యను, పదో నిందితురాలిగా ఇద్దనపూడి విజయలక్ష్మిని, 11వ నిందితుడిగా చంద్రమౌళి, 12వ ముద్దాయిగా జగతి పబ్లికేషన్స్, 13వ ముద్దాయిగా జననీ ఇన్‌ఫ్రాలను సిబిఐ చేర్చింది.

వైయస్ జగన్ ఆస్తుల కేసులో 263 డాక్యుమెంట్లతో 68 పేజీల చార్జిషీట్‌ను సిబిఐ శనివారం సాయంత్రం ప్రత్యేక కోర్టులో సమర్పించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 66 మంది సాక్షుల వాంగ్మూలాలను సిబిఐ సేకరించింది. కాగా, విజయసాయి రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌ను కోర్టు పొడగించింది. ఏప్రిల్ 13వ తేదీ వరకు ఈ రిమాండ్‌ను కోర్టు పొడగించింది.

English summary
CBI has named YS Jagan as accused 1 in chargesheet in YS Jagan assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X