వైయస్ జగన్ పార్టీలోకి వంగవీటి రాధాకృష్ణ

ప్రత్తిపాడు మాజీ శానససభ్యుడు మేకతోటి సుచరిత నివాసంలో ఆయన దాదాపు గంట పాటు జగన్‌తో మంతనాలు జరిపారు. త్వరలో తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని వంగవీటి రాధా మీడియా ప్రతినిధులతో చెప్పారు. తొలుత కాంగ్రెసు పార్టీలో ఉన్న వంగవీటి రాధా ఆ తర్వాత చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. చిరంజీవి తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించి ఆయన చాలా కాలం రాజకీయాలతో అంటీముంటనట్లుగా వ్యవహరించారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని చాలా కాలంగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆ విషయాన్ని ఆయన ఇప్పుడు ధ్రువీకరించారు.












Click it and Unblock the Notifications