శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు సిఎం పదవి 68వ కంపెని: ధర్మాన సెటైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dharmana Prasada Rao
శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ముఖ్యమంత్రి పదవి 68వ కంపెనీ అని మంత్రి ధర్మాన ప్రసాద రావు ఆదివారం ఎద్దేవా చేశారు. ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. రానున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీలు ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీలు అన్నారు. దొంగల పార్టీలను ఓడించాలన్నారు. వ్యాపార అభివృద్ధి కోసమే జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. నరసన్నపేటలో తన సోదరుడు, జగన్ పార్టీ నేత ధర్మాన కృష్ణబాబుతో ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేదని, అది కేవలం అపోహ మాత్రమే అన్నారు.

జగన్ ఓ కోళ్లఫారం యజమానితో సమానమన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసమే ఆయన ఆరాటం అంతా అన్నారు. జగన్‌కు లక్షల కోట్ల ఆస్తి ఎలా వచ్చిందో ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మరో మంత్రి కొండ్రు మురళీ మోహన్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన విమర్శలు చేయడం సరికాదన్నారు. కాగా ఏది ఏమైనా పోలవరం ప్రాజెక్టు నిర్మించి తీరుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంత్ కుమార్ వేరుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నారు. ఏప్రిల్, మే నెలల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి రెండు మూడేళ్లలో ప్రాజెర్టు నిర్మిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్లలేని పక్షంలో మేం మంత్రులుగా కొనసాగడానికి సిద్ధంగా లేమన్నారు.

English summary
Minister Dharmana Prasad Rao said that CM post is 68th company to YSR Congress Party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X