హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసం

NTR Statue
హైదరాబాద్: రాజధానిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు శనివారం ఉదయం ధ్వంసం చేశారు. నగరంలోని అశోక్ నగర్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆ దుండగులు పాక్షికంగా ధ్వంసం చేశారు. శనివారం తెల్లవారుజామున జరిగిన సంఘటన గురించి తెలుసుకున్న చిక్కడపల్లి పోలీసులు విగ్రహానికి గుడ్డ కప్పారు. హుటాహుటిన మరమ్మతులు చేయించారు.

విషయం తెలుసుకున్న స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకొని రాస్తారోకో నిర్వహించారు. ఆగ్రహంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండాలను దహనం చేశారు. అనంతరం చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎసిపి చంద్రశేఖర రెడ్డికి వినతి పత్రం అందించారు. ఇలాంటి చర్యలు అరికట్టకపోతే ప్రతిదాడులకు దిగాల్సి ఉంటుందని టిడిపి హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+