తెలంగాణ కోసం బిటెక్ విద్యార్థి ఆత్మహత్య

కాగా ఇటీవల తెలంగాణ కోసం వరుస ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలానికి చెందిన ఓ విద్యార్థి ఇటీవల తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత వరుస సంఘటనలు జరుగుతున్నాయి. వరంగల్‌లో మూడు, మెదక్‌లో ఒకటి, రాజధాని హైదరాబాదులోని ఎల్బీ నగర్‌లో విద్యార్థులు, యువకులు ఆత్మహత్య చేసుకొని బలయ్యారు.
ఆత్మహత్యల పట్ల తెలంగాణవాదులతో పాటు అన్ని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తదితరులు ఆత్మహత్యలు వద్దని బతికి సాధించుకోవాలని సూచించారు.
పోరాడి సాధించుకుందామని తెలంగాణ నేతలు పిలుపునిస్తున్నప్పటికీ తెలంగాణ జిల్లాలో ఆత్మహత్యలు ఆగటం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని, తెలంగాణ రాదనే ఉద్దేశ్యంతోనే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ చేసుకుంటున్న వారు పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications