హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోర్స్ కోడ్ చోరీ: హైదరాబాద్‌లో ముంబై ఇంజనీర్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mumbai Map
హైదరాబాద్: హైదరాబాదులోని ఓ సాఫ్ట్‌వేర్ శిక్షణా సంస్థ సోర్స్ కోడ్ చోరీకి పాల్పడిన ముంబైకి చెందిన సివిల్ ఇంజనీర్‌ను నేర దర్యాప్తు విభాగం (సిఐడి) పోలీసులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన వివేక్ ఘరద్ అనే ముంబై ఇంజనీర్‌ను సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని అమీర్‌పేటలో గల ఆటోకాడ్ సాఫ్ట్‌వేర్ శిక్షణ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

తమ కస్టమైజ్డ్ సాఫ్ట్‌వేర్ మోడ్యూల్‌ను మార్చి, దొంగిలించి, గుర్తు తెలియని వ్యక్తులు అమ్మకానికి పెట్టారని ఆ సంస్థ సిఐడికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సిఐడి పోలీసులు దర్యాప్తు సాగించారు.

తమ దర్యాప్తులో భాగంగా పోలీసులు పలువురు సాక్షులను విచారించారు. ఫిర్యాదు చేసిన సంస్థ ఐపి లాగ్ వివరాలను పరిశీలించారు. ప్రాసెస్‌లో ఎండ్ యూజర్ వివరాలను సేకరించిన పోలీసులు ఈ నెల 2వ తేదీన వివేక్ ఘరద్‌ను అరెస్టు చేశారు.

సంస్థలో శిక్షణ పొందే సమయంలో తాను సంస్థ సాఫ్ట్‌వేర్‌ను దొంగిలించినట్లు వివేక్ విచారణలో అంగీకరించాడు. చోరీ చేసిన సాఫ్ట్‌వేర్‌ సహాయంతో అతను యూట్యూబ్ డాట్ కామ్‌లో కొన్ని వీడియో క్లిప్పింగులు కూడా పోస్టు చేసినట్లు సిఐడి అదనపు ఎస్పీ యు రామ్మోహన్ చెప్పారు.

పోలీసులు వివేక్ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే చోరీ చేసిన సాఫ్ట్‌వేర్‌ను లోడ్ చేశాడు. వివేక్‌ను సిఐడి పోలీసులు బుధవారం కోర్టులో హాజరు పరిచారు. అతనికి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

English summary
Crime Investigation Department (CID) sleuths have arrested a Mumbai-based civil engineer for source code theft from a software training institute in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X