హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పంతం నెగ్గించుకున్న 'కిరణ్', తప్పుకున్న ఎసిబి జెడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srinivas Reddy
హైదరాబాద్: విజయనగరం మద్యం సిండికేట్లపై విచారణ జరుపుతున్న ఎసిబి జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకుంది. ప్రభుత్వం జారీ చేసిన మెమోను శ్రీనివాస్ రెడ్డి తీసుకున్నారు. ఎసిబి నుడి రిలీవ్ కానున్నారు. ఆయన ఈ రోజు కానీ లేదా రేపు కానీ కోస్టల్ సెక్యూరిటీ అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకుముందు శ్రీనివాస్ రెడ్డి ఎసిబి డైరెక్టర్ భూపతిబాబుతో భేటీ అయ్యారు.

ఎసిబి జెడి శ్రీనివాస్ రెడ్డి బదలీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. శ్రీనివాస్ రెడ్డి రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఇచ్చిన బదలీ ఉత్తర్వులను తీసుకోలేదు. ఎసిబి డైరెక్టర్ భూపతిబాబు కూడా శ్రీనివాస్ రెడ్డిని రిలీవ్ చేసేందుకు ససేమీరా అన్నారు. దీంతో ఇది రాష్ట్రంలో సంచలనం రేపింది. ఎలాగైనా శ్రీనివాస్ రెడ్డిని బదలీ చేయాలన్న ఉద్దేశ్యంతో కిరణ్ ప్రభుత్వం శుక్రవారం ఛార్జ్ మెమో ఇచ్చింది. దీనిని పోలీసులు సమక్షంలో ఆయనకు ఇచ్చారు.

భూపతి బాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చలు జరిపారు. శ్రీనివాస్ రెడ్డిని రిలీవ్ చేయవద్దని ఆయన సిఎస్‌ను కోరారు. అయితే రిలీవ్ చేయాల్సిన ఆవశ్యకతపై సిఎస్ భూపతిబాబుకు వివరించారని తెలుస్తోంది. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డితోనూ చర్చలు జరిపిన అనంతరం బదలీ ఓకే అయింది. ఈ సమన్వయానికి డిజిపి కృషి చేశారు. కాగా శ్రీనివాస్ రెడ్డి స్థానంలో శివధర్ రెడ్డి వచ్చిన విషయం తెలిసిందే.

కాగా అంతకుముందు అఖిలపక్షం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసింది. నిజాయితీ అధికారి అయిన శ్రీనివాస్ రెడ్డిని రిలీవ్ చేయవద్దని సిఎంను కోరింది. కుంభకోణంలో మంత్రుల ప్రత్యక్ష ప్రమేయంపై రుజువులు బయటపడుతున్న నేపథ్యంలో దర్యాఫ్తును నీరుగార్చే విధంగా చేయవద్దని కోరారు. అందుకు కిరణ్ ఎసిబిలో నిజాయితీగా పని చేసే అధికారులు ఎంతో మంది ఉన్నారని వారికి సమాధానం ఇచ్చారు. మద్యం సిండికేట్లపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని సిఎం వారికి హామీ ఇచ్చారు.

English summary
ACB joing director Srinivas Reddy replaced by Sivadhar Reddy on friday. Srinivas Reddy took government charge orders. He may take coastal security officer charge today evening or tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X