హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్‌కు చెప్పినా తప్పించలేదు: సిబిఐ ఎదుట సబిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabitha Indra reddy
హైదరాబాద్: గనుల శాఖ సంచాలకునిగా, ఎపిఎండిసి ఎండిగా రెండు పోస్టుల్లో రాజగోపాల్‌ను దీర్ఘకాలం కొనసాగించడంపై తాను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లానని ప్రస్తుత హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. రాజగోపాల్‌ను ఎక్కువ కాలం రెండు పోస్టుల్లో ఎందుకు కొనసాగిస్తున్నారని, ఒక పోస్టులోంచి తొలగించాలని తాను వైయస్‌కి సూచించినప్పటికీ ఆయన తప్పించలేదని సబిత సిబిఐ ఎదుట చెప్పారు.

ఈ విషయంలో పలు దఫాలుగా తాను వైయస్‌తో చర్చించానని ఆమె చెప్పారు. రాజగోపాల్ వద్ద ఉన్న రెండు పోస్టుల్లో ఒకదాంట్లో మరో అధికారిని నియమించాలని కోరానని, అయితే ఆయన స్థానంలో పని చేయడానికి మరో సమర్థుడైన అధికారి లేకపోవడంతో తప్పించలేక పోతున్నట్లు వైయస్ చెప్పారన్నారు.

గనుల లీజుల మంజూరు కోసం అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మిపై వైయస్ ఒత్తిడి తెచ్చారనే విషయం తనకు తెలియదని చెప్పారు. ఒఎంసికి సాంకేతికంగా నిపుణులైన అధికారుల సిఫార్సుల ఆధారంగానే లీజు అనుమతులిచ్చామని, 68.5 హెక్టార్లకు సంబంధించి ఒఎంసికి లీజు మంజూరుపై సంతకం చేసిన విషయం వాస్తవమేనని ఆమె చెప్పారు.

సాధారణంగా కార్యదర్శి సిఫార్సులను యథాతథంగా ఆమోదిస్తామని, నిబంధనలకు అనుగుణంగా మాకు మార్గదర్శనం చేయాల్సింది కార్యదర్శేనని, అంతేకాకుండా సంబంధింత అంశంపై వస్తవాలను కూడా వారే తెలియజేయాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగానే ఫైలు తన వద్దకు వచ్చిందని, దాన్ని క్లియర్ చేసి పంపానని చెప్పారు. క్యాప్టివ్ అన్న పదం తనకు పంపిన ఫైలులో ఉందని, జివోలో తొలగించిన విషయం మాత్రం తనకు తెలియదన్నారు.

అలాగే ఎపిఎండిసికి రిజర్వ్ చేసిన 25 హెక్టార్లను కేటాయించాలని గాలి జనార్ధన్ రెడ్డి వైయస్‌కు దరఖాస్తు చేసుకున్న విషయం తన దృష్టికి వచ్చిందని, ఆ దరఖాస్తు ఆధారంగానే 25 హెక్టార్లను కేటాయించడానికి శ్రీలక్ష్మి ప్రయత్నించగా అలాంటివి విరమించుకోవాలని ఆమెకు సూచించానని చెప్పారు. కాగా ఒఎంసి కేసులో శ్రీలక్ష్మిపై అదనపు ఛార్జీషీట్ దాఖలు చేసిన సిబిఐ సబితా ఇంద్రా రెడ్డిని 8 సాక్షిగా పేర్కొంది.

English summary
Home Minister Sabita Indra Reddy told to the CBI that former chief minister YSR had let V.D. Rajagopal, accused in the OMC case, to continue in two posts simultaneously for several years. “I brought it to his notice on a couple of occasions, but he said Mr Rajagopal was being continued as there was no one who could replace him in one of the two posts being held by him,’’ the minister told to the CBI in her statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X