జగన్ దారి తప్పాడని తల్లి విజయమ్మ చెప్పింది: వర్ల

'నువ్వు బెంగళూర్‌లో ఉండు, హైదరాబాద్ రాకు, నన్ను బజారున వేయకు, నా రాజకీయ జీవితాన్ని దెబ్బ తీయకు' అని వైయస్ రాజశేఖర రెడ్డి జగన్‌తో అంటున్నారని విజయమ్మ చెప్పారని ఆయన అన్నారు. ఈ విషయాలు నిజం కావా అని ఆయన వైయస్ జగన్‌ను ప్రశ్నించారు. తన భర్త, కుమారుడు తరుచూ ఘర్షణ పడుతున్నారని విజయమ్మ మంత్రితో చెప్పుకున్నారని ఆయన అన్నారు.
వైయస్ జగన్‌కు విశ్వసనీయత లేదని ఆయన అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన వైయస్ జగన్‌ను అనుసరించవద్దని ఆయన ప్రజలకు హితవు చెప్పారు. జగన్ ప్రవర్తన అనుసరణయం కాదని ఆయన అన్నారు. బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని వైయస్ జగన్ అవమానించారని ఆయన అన్నారు. వైయస్ వివేకానంద రెడ్డిపై దాడి చేయడానికి జగన్ అనుచరులు ప్రయత్నించడం, వైయస్ వివేకానంద వారిని హెచ్చరించడం వాస్తవం కాదా అని ఆయన అడిగారు. జగన్ తన ప్రవర్తనను ఎలా సమర్థించుకుంటారని ఆయన అడిగారు.
వైయస్ జగన్ మేక వేషంలో ఉన్న పులి అని ఆయన అభివర్ణించారు. జగన్ అబద్ధపు, మోసం మాటలను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. జగన్ మాటలు నమ్మి మోసపోవద్దని, జీవితాలు పాడు చేసుకోవద్దని ఆయన హితవు చెప్పారు. జగన్ నమ్మితే కసాయివాడిని నమ్మినట్లేనని ఆయన అన్నారు. జీవితాన్ని వైయస్ కుటుంబానికి అంకితం చేసిన సూరీడుని వైయస్ జగన్ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications