వైఎస్సా, సోనియానా తేల్చుకోండి: బొత్స కిరణ్‌కు విహెచ్

V Hanumanth Rao
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డియా, ఏఐసిసి అధ్యక్షురాలు, యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కావాలా తేల్చుకోవాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు మంగళవారం ప్రదేశ్ కాంగ్రసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సూచించారు. సోనియా నాయకత్వం కావాలా వైయస్ నామం కావాలా త్వరగా తేల్చుకోండని సూచించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నించారు. వైయస్, జగన్ ఇద్దరూ ఒకటేనని ఆయన ఆరోపించారు. జగన్‌ను, వైయస్‌ను వేరువేరుగా చూస్తే ప్రజలు నమ్మరని ఆయన చెప్పారు.

జగన్‌ను ఎదుర్కోవడానికి ఇదే సరైన సమయం అని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ పైన ఎవరికైనా మమకారం ఉంటే వారు కాంగ్రెసులో ఉండాలో వద్దో తేల్చుకోవాలని చెప్పారు. వైయస్ మన పార్టీ నేత కదా అని తప్పు దాచి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో అల్లర్ల బాధితులను పరామర్శించేందుకు జగన్ మందీ మార్భలంతో వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ఓదార్పు యాత్ర పేరుతో రాజకీయ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఓదార్పు పేరిట రాజకీయాలు చేయడం శోచనీయమన్నారు.

జగన్‌కు పోలీసుల సహకారం ఉందన్నారు. కాంగ్రెసు పార్టీలో ఐక్యత ఉందన్నారు. అందుకే చిక్‌మగ్‌లూరు, ఒడిపిలలో విజయం సాధించామన్నారు. 2జి కుంభకోణంలో యుపిఏలో భాగస్వామ్య పక్షమైన డిఎంకె నేతలను కూడా కేంద్రం జైళ్లకు పంపిందన్నారు. ఎసిబి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని చెప్పారు.

వైయస్ వల్ల కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రాలేదని ఆయన చెప్పారు. వైయస్ పాదయాత్ర వల్లే 2004లో కాంగ్రెస్ అధికారం ఛేజిక్కించుకుందనేది కేవలం అపోహ మాత్రమేనని చెప్పారు. వైయస్సే కాంగ్రెసు వల్ల ఎదిగారన్నారు. వైయస్ హయాంలో కేటాయించిన భూములను రద్దు చేసే సమయం వస్తుందని ఆయన చెప్పారు. ఎసిబి వ్యవహారంలో ఆసక్తి చూపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మార్ వ్యవహారంలో ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+