వైయస్ కాంగ్రెసు నేతనే: మంత్రి రఘువీరా రెడ్డి

వైయస్ రాజశేకఖర రెడ్డిని కూడా అవినీతికి బాధ్యుడిని చేసి విమర్శించాలనే వాదన కాంగ్రెసు పార్టీలో ఓ వర్గం నుంచి బలంగా వస్తోంది. సీనియర్ నేత వి. హనుమంతరావు వంటివారు ఆ విషయాన్ని ముందుకు తెస్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెసు పార్టీలో విభేదాలు చోటు చేసుకున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డిని తమ పార్టీ నేతగానే గుర్తించాలని, వైయస్సార్‌ను విమర్శించకూడదని ఓ బలమైన వర్గం వాదిస్తోంది. మంగళవారం ముఖ్యమంత్రి ఎదుట కొందరు మంత్రులు ఈ విషయాన్ని ప్రస్తావించి, వైయస్‌ను విమర్శిస్తుండడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కొంత మంది కాంగ్రెసు నాయకులు విమర్శిస్తుండడాన్ని ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ వ్యతిరేకించారు. ప్రభుత్వ పని తీరుపై విమర్శలు చేయవద్దని ఆయన సూచించారు. ముఖ్యమంత్రిపై విమర్శలు స్వార్థపరుల కుట్రేనని ఆయన బుధవారం హైదరాబాదులో బిసి ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకల్లో అన్నారు.
వైయస్ జగన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్యారనే ఆరోపణల్లో అర్థం లేదని ఆయన అన్నారు. తెలంగాణ అంశం కాంగ్రెసు ఎజెండాలో ఉందని ఆయన చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ముఖ్యమంత్రుల మార్పు ఉంటుందని ఆయన అన్నారు. అప్పటి వరకు కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications