జగన్ కేసు: కెబినెట్ నిర్ణయాలపై ప్రశ్నించారన్న ధర్మాన

సీలింగ్ చట్టాల నుంచి ఆయా కంపెనీలకు మినహాయింపు ఎందుకిచ్చారని ఆయనను ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. మంత్రి ధర్మాన ప్రసాద రావుతో పాటు ఐఏఎస్ అధికారి శామ్యూల్‌ను కూడా సిబిఐ అధికారులు శుక్రవారం విచారించారు. జగన్ ఆస్తుల కేసులో ఇప్పటికే సిబిఐ అధికారులు మంత్రి మోపిదేవి వెంకట రమణను విచారించారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని ఆమె ఇంటి వద్ద విచారణ చేశారు. వివాదాస్పద జివోల కేసులో మిగిలిన మంత్రులను, అధికారులను కూడా సిబిఐ విచారించనుంది.
సిబిఐ విచారణ అనంతరం మంత్రి ధర్మాన ప్రసాద రావు మీడియాతో మాట్లాడారు. సిబిఐ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని స్పష్టం చేశారు. తనకు తెలిసిన సమాచారం వారికి ఇచ్చానని తెలిపారు. ఓ ప్రముఖ కంపెనీ కోసం జారీ చేసిన జివోలపై సిబిఐ ప్రశ్నించిందని, అలాగే కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నించిందని ఆయన చెప్పారు. తనను 28 ప్రశ్నలకు సమాధానం చెప్పమన్నారని, బాధ్యత గల పౌరుడిగా వాటికి సమాధానమిచ్చానన్నారు. తాను లంచ్ కు వెళుతున్నట్లు చెప్పారు. ధర్మానను సిబిఐ మూడు గంటల పాటు ప్రశ్నించింది.
కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ పది రోజుల క్రితం నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేసింది. తర్వాత విడుదల వారీగా అదనపు ఛార్జీషీటులు దాఖలు చేస్తామని తెలిపింది.












Click it and Unblock the Notifications