టిక్కూ హత్య: పోలీసుల అదుపులో నటి సిమ్రాన్ సూద్

Simran Sood
ముంబై: ఢిల్లీకి చెందిన 65 ఏళ్ల వ్యాపారవేత్త అరుణ్ కుమార్ టిక్కూ హత్య కేసులో పోలీసులు బాలీవుడ్ వర్ధమన నటి సిమ్రాన్ సూద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అరుణ్ కుమార్ టిక్కూ శనివారంనాడు లోకాంద్‌వాలా కాంప్లెక్స్‌లోని తన అపార్టుమెంటులో హత్యకు గురయ్యాడు. గత రాత్రి సిమ్రాన్ సూద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని వాంగ్మూలం రికార్డు చేస్తున్నారు.

ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు విజయం పలండే తనను సిమ్రాన్ ద్వారా నటుడైన హతుడి కుమారుడు అనుజ్ టిక్కూకు కరణ్ సూద్‌గా పరిచయం చేసుకున్నాడు. సిమ్రాన్ తన సోదరి అని పలండే అనుజ్‌కు చెప్పాడు. హత్య కేసులో పోలీసులు పలండే, ధనంజయ్ షిండే, మనోజ్ గజ్‌కోష్‌లను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పలండే పారిపోవడానికి ప్రయత్నించిన సమయంలో అతనితో పాటు ఉన్న నలుగురు పోలీసులపై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించారు.

పోలీసులు మంగళవారం అనుజ్ టిక్కును, అతని మిత్రుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నంచారు. తన తండ్రిని అనుజ్ హత్య చేసి ఉంటాడని తొలుత పోలీసులు అనుమానించారు. తండ్రి హత్యకు గురైనప్పటి నుంచి అనుజ్ కనిపించకుండా పోవడం అనుమానాలకు తావిచ్చింది. అనుజ్ మానసిక సమస్యతో బాధపడుతున్నాడని, అతను గత నాలుగేళ్లుగా జైపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, తండ్రి వదిలేయడంతో ఒంటరిగా ఉంటున్నాడని పోలీసులు అప్పట్లో చెప్పారు.

ముంబైలోని అంధేరీలోని ఓ అద్దె అపార్టుమెంటులో అనుజ్ ఉంటున్నాడు. శనివారం నుంచి అతను కనిపించడం లేదు. తండ్రి హత్య గురించి తనకు తెలియదని అనుజ్ అంటున్నాడు. హత్య కేసులో అనుజ్ ప్రధాన అనుమానితుడని, సాక్ష్యాల సేకరణకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+