నిప్పంటించుకొని: తెలంగాణ కోసం విద్యార్థి బలిదానం

ఆదివారం ఉదయం 10.00 గంటల ప్రాంతంలో ఓ లేఖ రాసి ఇంట్లో పెట్టి స్నానం కోసం బాత్ రూంలోకి వెళ్లాడు. అక్కడ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అరుపులు వినపడకుండా నోట్లో గుడ్డలు పెట్టుకున్నాడు. పొగలు, మంటలు రావడం చూసిన కుటుంబ సభ్యులు తలుపులను బద్దలు కొట్టి చూసేసరికే నరేష్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని తల్లిదండ్రులు బాధతో కుప్పకూలిపోయారు.
నరేష్ బలిదానం విషయం తెలిసి ప్రజలు, తెలంగాణవాదులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇటీవలే డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలు రాసిన నరేష్ ఎమ్మెస్సీ కోచింగ్ తీసుకోవాలని భావించాడు. అయితే ఆయన తమ్ముడు సురేష్ బిఫార్మసీ చేస్తుండటంతో తల్లిదండ్రులకు మరింత భారమవుతుందని కూడా భావించినట్లు తెలుస్తోంది. తన చావుతోనైనా తెలంగాణ రావాలని, ఇదే ఆఖరి ఆత్మహత్య కావాలని లేఖలో రాసి ఉంది.
తెలంగాణకై ఆత్మబలిదానం చేసిన నరేష్ నాలుగు పేజీల సూసైడ్‌నోట్ రాశారు. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, తెలంగాణలో పుట్టడమే చేసిన మొదటి తప్పని, తెలంగాణ విద్యార్థులు ఎంత ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాక, తల్లిదండ్రులను సుఖపెట్టలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మిత్రులను వదిలిపోతున్నందుకు బాధగా ఉందని, కుటుంబ సభ్యులు తనను క్షమించాలని తమ్ముడు సురేష్ అమ్మా, నాన్నలను మంచిగా చూసుకోవాలని లేఖలో కోరాడు.
మరోవైపు మెదక్ పట్టణానికి చెందిన వ్యాపారి గంగారెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదేమోనని మనస్తాపం చెంది ఆదివారం రాత్రి మూడంతస్థుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications