జగన్‌నూ వదిలిపెట్టం, ముగ్గురూ ఒక్కటే: హరీష్

తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది తామేనని చెప్పే కాంగ్రెసు నాయకులు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలపై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు. లగడపాటి పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారా, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా అని ఆయన అడిగారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు నాటకాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. పరకాలలో కాంగ్రెసు నాయకులు తాము తెలంగాణ తెస్తామని అంటారని, సీమాంధ్రలో కాంగ్రెసు నాయకులు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతారని ఆయన అన్నారు.
పరకాలలో తాము పోటీ చేస్తామని ఆయన చెప్పారు. పరకాలలో తాము గెలిచి తీరుతామని ఆయన అన్నారు. నాయని నర్సింహా రెడ్డి నేతృత్వంలోని ఎన్నికల కమిటీ రెండు మూడు రోజుల పాటు చర్చలు జరిపి అభ్యర్థిని ప్రకటిస్తారని ఆయన చెప్పారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఓటమిపై విచారణ కమిటీ వేయనున్నట్లు నాయని నర్సింహా రెడ్డి చెప్పారు. పార్టీ 11వ వార్షికోత్సవాల నిర్వహణకు నిరంజన్ రెడ్డి, మధుసూదనాచారి, జగదీశ్వర్ రెడ్డిలతో కమిటీ వేసినట్లు ఆయన తెలిపారు.
కరెంట్ చార్జీల పెంపుపై హరీష్ రావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. పెంచిన కరెంట్ చార్జీలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. వృత్తికారులు కరెంట్ బిల్లులు చెల్లించలేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు తెలంగాణలోనే 90 శాతం ఉన్నాయని, వాటికి ఏడు గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తామంటున్నారని, అదనంగా కావాలంటే యూనిట్‌కు 3.60 రూపాయలు కట్టాలని చెబుతున్నారని, ఇది తెలంగాణ రైతులను దెబ్బ తీయడమేనని ఆయన అన్నారు. రూ. 4,400 కోట్ల మేరకు విద్యుత్ చార్జీలు పెంచి 150 కోట్ల రూపాయలు మాత్రమే తగ్గించారని ఆయన అన్నారు.
వరంగల్‌లో ధర్నా చేసిన మిర్చి 350 మంది రైతులపై కేసులు పెట్టారని ఆయన చెప్పారు. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర కావాలని ధర్నా చేస్తే కేసులు పెట్టడం ఏమిటని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications