బీఫ్ ఫెస్టివల్: ఉస్మానియాలో విద్యార్థుల ఘర్షణ

ప్రజాస్వామిక సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఓయూ ఎన్ఆర్ఎస్ హాస్టల్ వద్ద బీఫ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు సాయంత్రం 4 గంటల నుంచే వివిధ హాస్టళ్ల నుంచి వి ద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. కొంచెంసేపు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవ ప్రత్యేకతను వివరించారు. అనంతరం విద్యార్థులు భోజనాలు మొదలుపెట్టారు. అదే సమయంలో ఓయూ బీ-హాస్టల్ వైపు నుంచి 200 మంది విద్యార్థులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఎన్ఆర్ఎస్ హాస్టల్ వైపు దూసుకొచ్చారు. విషయాన్ని గమనించిన పోలీసులు విద్యార్థులను ఓయూ స్విమ్మింగ్ పూల్ వద్ద అడ్డుకున్నారు. విద్యార్థులు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. బీఫ్‌ఫెస్టివల్ నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అకస్మాత్తుగా పక్కనే ఉన్న న్యూపీజీ హాస్టల్ వైపుకు దూసుకెళ్లి భోజనం చేస్తున్న విద్యార్థులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఫెస్టివల్‌కు హాజరైన విద్యార్థులు రాళ్లతో ఎదురు దాడికి దిగారు. రెండు వర్గాలు అరగంట పాటు పరస్పరం ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాల విద్యార్థులు గాయపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని గమనించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేం దుకు పది రౌండ్ల భాష్పవాయు గోళాలు ప్రయోగించారు.
తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడిపై దాడి గొడవంత సద్దుమణిగిన తర్వాత ఉస్మానియా యూనిర్సిటీ పరిశోధనా విద్యార్థి, తెలంగాణ విద్యార్శి వేదిక (టీవీవీ) నాయకుడు వెంకట్‌పై సి-హాస్టల్ వద్ద కొంత మంది విద్యార్థులు దా డి చేశారు. ఈ దాడిలో ఆయనతో పాటు మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వెంకట్‌ను చికిత్స ని మిత్తం ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడింది ఏబీవీవాళ్లేనని, తాము నిర్వహిస్తున్న బీఫ్ ఫెస్టివల్‌ను మొదటి నుంచి వ్యతిరేకించింది, అడ్డుకున్నది కూ డా ఏబీవీపీ నాయకులేనని ఏఐఎస్ఎఫ్ నాయకుడు స్టాలిన్, పీడీఎస్‌యూ నాయకులు కోట రాజేశ్, ఆజాద్ ఆరోపించారు.
ఫెస్టివల్‌కు హాజరైన ప్రముఖులు ఓయూలో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్‌కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అధ్యాపకుడు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్‌రావు, లా కళాశాల అధ్యాపకుడు డాక్టర్ గాలి వినోద్‌కుమార్, ఇప్లూ అధ్యాపకులు డాక్టర్ అలోషియస్, ప్రొఫెసర్ పార్ధసారథి, భాంగ్యాబుక్య, అంతర్జాతీయ దళిత రచయిత్రి మీనా కందస్వామి, పాండిచ్చేరి నుంచి ఫ్రెంచ్ అకడమిక్ సైంటిస్టు బ్రిగిట్, డాక్టర్ సెబస్టియన్ తదితరులు పెద్ద కూర పండుగలో పాల్గొన్నారు.
-
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications