ప్రజాపథం:ప్రభుత్వంపై డిఎల్ ఫైర్, విష్ణువర్ధన్‌రెడ్డి దూరం

ఎత్తి పోతల పథకం వల్ల వచ్చే లాభమేమీ లేదన్నారు. వ్యక్తిగతంగా ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి తాను పూర్తి వ్యతిరేకిని అని డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. కాంట్రాక్టర్లు, బ్రోకర్ల కోసమే ఎత్తిపోతల పథకమని ఆయన ఆరోపించారు. కేవలం పథకాల పేరుతో సర్దిపెట్టకుండా ప్రజల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలా అయితేనే ప్రజలు కాంగ్రెసు పార్టీకి దగ్గరవుతారని చెప్పారు.
మరోవైపు జూబ్లీహిల్స్ అధికార పార్టీ శాసనసభ్యుడు పబ్బతిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కూడా ప్రజాపథం కార్యక్రమానికి దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. తన నియోజకవర్గంలోని పలు సమస్యలను పరిష్కరించనందున విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన ప్రజాపథకం కార్యక్రమానికి దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. పెండింగ్ పనులు పూర్తి కాకపోవడం విష్ణును నిరుత్సాహానికి గురి చేసింది.
కాగా మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి సమయం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం మాత్రం ఆయన తాను రాజకీయాల పట్ల విసుగు చెందానని, నియోజకవర్గ ప్రజలను సంప్రదించి రాజకీయాల నుండి తప్పుకునే యోచనలో ఉన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications