తీవ్రవాదం సవాలే: ప్రధాని, మమతా బెనర్జీ డుమ్మా

అంతర్గత భద్రత సదస్సు ఎంతో ప్రాముఖ్యమైనదని చెప్పారు. ఎన్‌సిటిసిపై మే 5న ముఖ్యమంత్రులతో మరోసారి సమావేశమవుతామని మన్మోహన్ చెప్పారు. కేంద్రం, రాష్ట్రాలు చేయి చేయి కలిపితే అంతర్గత భద్రత సాధ్యమని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉందన్నారు. జమ్ముకాశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడిందన్నారు. తీర ప్రాంత భద్రతకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
జమ్మూ-కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో హింస తగ్గుముఖం పట్టిందని కేంద్ర హోంమంత్రి చిదంబరం చెప్పారు. హింస తగ్గడం వల్లనే భారత దేశానికి విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగిందని చెప్పారు. మావోయిస్టులను అదుపు చేసేందుకు రాష్ట్రాలకు కేంద్రం పూర్తి సాయం చేస్తుందని చెప్పారు. అంతర్గత భద్రతపై ఆయా రాష్ట్రాలు పూర్తిగా పకడ్బందీగా ఉండాలని సూచించారు. దేశంలో గత ఏడాది పద్దెనిమిది ఉగ్రవాద కేంద్రాలను నిర్మూలించామని చెప్పారు. మొత్తం ఆరు రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం వేళ్లూనుకుందని చెప్పారు.
అంతర్గత భద్రత సమావేశం న్యూఢిల్లీలోని తమిళనాడు హౌస్‌లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తదితరులు వచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరుకాకపోవచ్చునని మొదటి నుండి అనుమానిస్తున్నట్టుగానే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గైర్హాజరయ్యారు. ముఖ్యమంత్రుల సదస్సులో అంతర్గత భద్రత, మావోయిస్టుల హింసపై చర్చించారు.












Click it and Unblock the Notifications