సీరియస్‌గా ఉంది: విహెచ్, జగన్‌పై వాయలార్ రవి ఆరా

V Hanumanth Rao
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాష్ట్ర పరిస్థితిని సీరియస్‌గా తీసుకుంటుందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సభ్యుడు వి.హనుమంత రావు మంగళవారం అన్నారు. రాష్ట్ర పార్టీ పరిస్థితులను సరిదిద్దేందుకు వచ్చిన వాయలార్ రవిని ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అధిష్టానం రాష్ట్రంలో సీరియస్‌గా దృష్టి సారించిందని చెప్పారు.

ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాడనికే రవిని పంపారని చెప్పారు. ఆయనను పంపడం రాష్ట్రంలో పార్టీకి శుభసూచకమని చెప్పారు. ఉప ఎన్నికలలో ఖచ్చితంగా గెలవాల్సి ఉందన్నారు. వాయలార్ కారణంగా పార్టీ బలోపేతం అవుతుందని చెప్పారు. గతంలో కొన్ని ఇబ్బందుల కారణంగా కొందరు నేతలు పరిస్థితిని చెప్పలేక పోయారని, వాయలార్ రెండు రోజులు ఉంటారని ఆయనకు అన్నీ చెప్పుకోవచ్చునని అన్నారు.

వాయలార్ రవి ఇక్కడి నేతల నుండి అభిప్రాయాలను తీసుకొని అధిష్టానానికి ఇస్తారన్నారు. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలలో వాయలార్‌ను పర్యటించాలని తాను సూచించినట్లు చెప్పారు. అక్కడ పర్యటిస్తేనే స్థానిక పరిస్థితి అర్థమవుతుందని తాను చెప్పాని విహెచ్ తెలిపారు. ఆయన పార్టీ బలోపేతం కోసమే వచ్చారన్నారు.

మాజీ ఎంపీ విఠల్ రావు కూడా రవిని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఎక్కువగా ఉందని తాను చెప్పానని అన్నారు. పార్టీలో మార్పులు చేర్పులు ఉంటే ఉప ఎన్నికల తర్వాతే చేయాలని సూచించినట్లు చెప్పారు. తెలంగాణను త్వరగా తేల్చాలని లేదంటే పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పానన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల మధ్య సమన్వయం లేదని వారిని ఏకత్రాటి పైకి తీసుకు రావాలని కోరానని చెప్పారు. పిసిసి చీఫ్, ముఖ్యమంత్రి ఎంపికలో ఈక్వేషన్స్ సరిగా లేవని చెప్పానన్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, తులసి రెడ్డి తదితరులు వాయలార్ రవిని కలిశారు.

కాగా వాయలార్ రవి పార్టీ పరిస్థితులపై నేతల నుండి ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, తెలంగాణ, సీమాంధ్రలో జగన్ ప్రభావంపై ఆయన నేతల నుండి ఆరా తీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఎంత ఉంది, ఎంత కాలం పని చేస్తుంది, ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఆయన నేతలను అడుగుతున్నారని తెలుస్తోంది. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసును ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై ఆయన ప్రధానంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+