వాయలార్ రవి టూర్: ఉపఎన్నికల తర్వాత 'తెలంగాణ'

Telangana Map- Vayalar Ravi
హైదరాబాద్: త్వరలో సీమాంధ్రలో జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాల ఉప ఎన్నికల అనంతరం కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణపై నిర్ణయం ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ స్థితిగతులను తెలుసుకునేందుకు వచ్చిన వాయలార్ రవి రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, కాంగ్రెసు పార్టీలోని విభేదాలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.

అయితే ఆయన అంతకంటే ప్రధానంగా తెలంగాణపై తన పర్యటనలో దృష్టి సారిస్తున్నారని అంటున్నారు. తెలంగాణపై సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతల అభిప్రాయాలు ఆయన తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆయనను కలుస్తున్న తెలంగాణ ప్రాంత నేతలు తెలంగాణపై వెంటనే తేల్చాలని ఆయనను కోరుతున్నారు. తెలంగాణపై ఇప్పటికే ఆలస్యమైందని, మరింత జాప్యం జరిగితే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని వారు ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నారు.

సీమాంధ్ర నేతలు కూడా తెలంగాణ అంశం త్వరగా తేల్చాలని ఆయనతో చెబుతున్నారని తెలుస్తోంది. తెలంగాణను నాన్చడం వలన ఇరు ప్రాంతాలలో పార్టీ దెబ్బతింటుందని వారు ఆయనతో ఆవేదన వ్యక్తం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా త్వరగా తీసుకోవాలని సూచించారు. అయితే సీమాంధ్రలో జరగనున్న ఉప ఎన్నికల అనంతరం పార్టీ తెలంగాణపై ఓ నిర్ణయం ప్రకటించనుందని ఆయన వారితో చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఇరు ప్రాంతాల అభిప్రాయాలు తీసుకున్న వాయలార్ రవి తెలంగాణ అంశాన్ని ప్రధానంగా తేల్చాలని అధిష్టానానికి వివరించనున్నారని తెలుస్తోంది. తెలంగాణ తేల్చితేనే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాగుపడుతుందని ఆయన పార్టీ పెద్దలకు వివరించనున్నారని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. రవి నివేదిక అనంతరం పార్టీ తప్పకుండా సాధ్యమైనంత త్వరగా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తన టూర్‌లో వాయలార్ రవి తెలంగాణ అంశంపై చేస్తున్న ఫోకస్ చూస్తుంటే తెలంగాణ సమస్య త్వరలో పరిష్కారమవుతుందనే ఆశాభావం ఇరు ప్రాంతాల నేతలు వ్యక్తపరుస్తున్నారట. మరోవైపు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య ఎడం బాగా పెరిగిపోయిందని, వారిద్దరి మధ్య సమన్వయం కుదిర్చితేనే పార్టీకి లాభం ఉంటుందని చాలామంది నేతలు ఆయన వద్ద అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+