గాలి వాహనాల అప్పగింతపై నిర్ణయం వాయిదా

Gali Janardhan Reddy
హైదరాబాద్: సిబిఐ స్వాధీనం చేసుకున్న హెలికాప్టర్, ఇతర వాహనాలను తమకు తిరిగి ఇప్పించాలని కోరుతూ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డి పెట్టుకున్న పిటిషన్లపై సోమవారం కోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. సిబిఐ స్వాధీనం చేసుకున్న హెలికాప్టర్, ఇతర వాహనాలను వాడకపోతే చెడిపోతాయని, వాటిని తమకు అప్పగించాలని, వాటిని అవసరమైనప్పుడు అప్పగిస్తామని గాలి జనార్దన్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు.

వాటిని తిరిగి ఇచ్చేస్తే నిందితులు వాటిని తిరిగి కోర్టుకు అప్పగించకపోవచ్చునని సిబిఐ అనుమానాలు వ్యక్తం చేసింది. గనుల వ్యాపారంతో పాటు స్థిరాస్తి, హోటళ్ల వ్యాపారం చేస్తున్న ఒఎంసి కంపెనీ పేరిట ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకోవడం సరైంది కాదని గాలి జనార్దన్ రెడ్డి తరఫు న్యాయవాది అన్నారు. శ్రీనివాస రెడ్డి ఎండిగా ఉన్న ఇతర సంస్థల వాహనాలను కూడా సిబిఐ స్వాధీనం చేసుకుందని ఆయన చెప్పారు. ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.

ఒఎంసి కేసులో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి, ఎమ్మార్ కేసులో బిపి ఆచార్య బెయిల్ పిటిషన్లపై తమ అభ్యంతరాలను దాఖలు చేసేందుకు సిబిఐ కోర్టును గడువు కోరింది. అందుకు కోర్టు అనుమతించింది. విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఎమ్మార్ కేసులో తన నేరాన్ని మన్నించాలని స్టైలిష్ హోమ్స్ డైరెక్టర్ తుమ్మల రంగారావు కోర్టును కోరారు. రంగారావు పిటిషన్‌పై ఆయన తరఫు న్యాయవాది దుర్గాప్రసాద్ సిబిఐ కోర్టులో తన వాదనను వినిపించారు.

రంగారావు కేవలం కోనేరు ప్రసాద్ సూచనల మేరకు విల్లాల సొమ్మును వసూలు చేశారని, ఆ సొమ్మును కోనేరు ప్రసాద్‌కు, సునీల్ రెడ్డికి ఇచ్చారని దుర్గాప్రసాద్ కోర్టు ముందు చెప్పారు. జరిగిందంతా సిబిఐకి చెప్పి విచారణకు సహకరిస్తానని తుమ్మల రంగారావు చెప్పుకున్నారు. రంగారావు అభ్యర్థనను కోర్టు అంగీకరిస్తే తమకు అభ్యంతరం లేదని సిబిఐ చెప్పింది.

రంగారావును క్షమించి వదిలేయకూడదని అదే కేసులో నిందితుడు విజయరాఘవ అన్నారు. విల్లాల కొనుగోలుదారుల నుంచి అదనంగా 93 కోట్ల రూపాయలు రంగారావు వసూలు చేసినట్లు ఆయన, సిబిఐ అంగీకరించినట్లు విజయరాఘవ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఆ డబ్బు రికవరీకి రానందున రంగారావును క్షమించి వదిలేయడం సరి కాదని విజయరాఘవ అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.

ఇదిలావుంటే, ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు షిర్డీ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రంగారావు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రంగారావు పిటిషన్‌పై అభ్యంతరాలుంటే తెలపాలని కోర్టు సిబిఐని ఆదేశిస్తూ ఈ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+