రాష్ట్ర వార్షిక ప్రణాళిక రూ.48,935 కోట్లు, పనితీరు భేష్

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: రాష్ట్ర వార్షిక ప్రణాళికా పెట్టుబడులను ప్రణాళిక సంఘం రూ.48,935 కోట్లుగా అమోదించింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ సింగ్ అహ్లూవాలియాను కలిసి చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఆయన ప్రశంసించారు. ప్రభుత్వ పథకాలకు ప్రణాళికా సంఘం మద్దతు పలికిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

ప్రస్తుతం ప్రణాళిక సంఘం ఆమోదించిన పెట్టుబడుల మొత్తం గత ఆర్థిక సంవత్సరం కన్నా 13 శాతం ఎక్కువని ముఖ్యమంత్రి చెప్పారు. పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఆ రెండు ప్రాజెక్టులకు సూత్రబద్దంగా అన్ని అనుమతులు లభించాయని, కానీ పూర్తి అనుమతులు లభించిన తర్వాత వాటి గురించి మళ్లీ సిఫార్సు చేస్తామని ఆయన చెప్పారు.

స్త్రీనిధి బ్యాంక్‌కు రూ.200 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. ట్రిపుల్ ఐటిలకు నిధులు ఇవ్వాలని కూడా కోరినట్లు ఆయన చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులపై తాము పద్ధతి ప్రకారం వెళ్తున్నామని ఆయన చెప్పారు. ట్రాన్స్ మిషన్ కారిడార్‌ను వెంటనే పూర్తి చేయాలని తాము కోరామని ఆయన చెప్పారు. గ్యాస్ ఆధారిత విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులకు గ్యాస్ మరింత కేటాయించాలని కోరామని ఆయన చెప్పారు.

పార్టీ అధిష్టానం పరిశీలకుడు వాయలార్ రవిని మంత్రులు కలుసుకోవడంపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా పార్టీ అధిష్టానం నేతలతో మంత్రులు కలిసి పార్టీ గురించి మాట్లాడారని, పార్టీని బలోపేతం చేయడంపై మాట్లాడారని ఆయన చెప్పారు. వాయలార్ రవి హైదరాబాద్ వెళ్తున్నారని తనకు తెలుసునని, తనకు అధికార కార్యక్రమాలు ఉండడం వల్ల ఢిల్లీలో ఉన్నానని ఆయన చెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ పార్లమెంటు సమావేశాల వ్యవహారాలకు సంబంధించి బిజీగా ఉన్నారు కాబట్టి వాయలార్ రవి రాష్ట్రంలోని ఉప ఎన్నికల వ్యవహారాలను చూస్తున్నారని ఆయన చెప్పారు. మీడియా శుద్ధ అబద్ధాలు రాసిందని ఆయన ఒక సందర్భంలో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+