చిరు టాప్‌లీడరన్న రవి, విభేదాల్ని తేలిగ్గా కొట్టేసిన చిరు

Vayalar Ravi - Chiranjeevi
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర వ్యవహారాలపై పూర్తి స్థాయి నివేదిక తయారు చేసేందుకు వచ్చిన వాయలార్ రవికి రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి బుధవారం ఉదయం తన ఇంట్లో అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందుకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

అల్పాహార విందు అనంతరం వాయలార్ రవి, చిరంజీవి మీడియాతో మాట్లాడారు. విందు సందర్భంగా తాము తిరుపతి నియోజకవర్గం అభ్యర్థిపై చర్చించలేదని వాయలార్ చెప్పారు. దేశ, రాష్ట్ర ప్రస్తుత రాజకీయాలపై చర్చించామని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ శ్రేణులను పార్టీకి వినియోగించుకుంటామని చెప్పారు. అన్ని సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయన్నారు.

కాంగ్రెసు ముఖ్య నేతలలో చిరంజీవి ఒకరు అని చెప్పారు. చిరంజీవిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉపయోగించుకుంటామని చెప్పారు. ఉప ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేశాక ప్రచార పర్వంపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఏ పార్టీలో అయినా భిన్నాభిప్రాయాలు సహజమేనన్నారు. ఉప ఎన్నికలలో సమర్థులకే టిక్కెట్లు ఇస్తామని చెప్పారు.

కాంగ్రెసు పార్టీ చిరంజీవికి సముచిత స్థానం కల్పించిందని చెప్పారు. తాను గురువారం తూర్పు గోదావరిలో పర్యటిస్తానని చెప్పారు. చిరంజీవితో చర్చించి ఆయన అభిప్రాయాలు తెలుసుకున్నానని చెప్పారు. తిరుపతి అభ్యర్థిపై ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదని చిరంజీవి చెప్పారు. అభ్యర్థుల ఖరారు తర్వాత ప్రచారం చేస్తామన్నారు.

తన ఇంటికి అల్పాహార విందుకు రవి రావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఆయన రాజకీయాల్లో తలపండిన నేత అని, ఆయన సలహాలు తీసుకొని ముందుకు వెళతామని చెప్పారు. పార్టీ అన్నాక భేదాభిప్రాయాలు సహజమేనని చెప్పారు. అవి ఏ పార్టీలోనైనా ఉంటాయని చెప్పారు. విలీనం క్షేత్రస్థాయికి వెళ్లడానికి కాస్త సమయం తీసుకుంటుందని చెప్పారు.

త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలలో పదిహేడు కాంగ్రెసువే అయినప్పటికి ఆ ప్రజాప్రతినిధులు అందరూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరిపోయారు. తిరుపతి ఒక్కటే కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధిగా ఖాళీ అయిన నియోజకవర్గం. దీంతో మిగతా వాటికంటే ఈ నియోజకవర్గంలో గెలుపుకు కాంగ్రెసుకు మరింత ప్రతిష్టాత్మకం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+