రక్తం మసలుతోంది: నిప్పులు చెరిగిన యడ్యూరప్ప

పార్టీ సభ్యులను ఆయన విమర్శించారు. వారు తన ప్రత్యర్థి పార్టీతో చేతులు కలిపి ఉంటారని ఆయన ఆరోపించారు. తన రక్తం మసలుతోందని, యడ్యూరప్ప అంటే ఏమిటో చూపిస్తానని ఆయన అన్నారు. నమ్మినవాళ్లే తనను మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. తనను వెన్నుపోటు పొడిచారని, తనకు వ్యతిరేకంగా కుట్ర చేశారని ఆయన అన్నారు. వారికి తాను భయపడడం లేదని, కాలమే వారికి పాఠం చెబుతుందని ఆయన అన్నారు.
గత కొద్ది కాలంగా తాను మౌనంగా ఉన్నానని, తానేమిటో వారికి చూపిస్తానని, తన రాజకీయ శత్రువుల కుట్రలు సాగవని ఆయన అన్నారు. తనతో చీలినపోయినవారు తనను భరించరాని వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే మానసిక స్థితిలో కూడా తాను లేనని ఆయన అన్నారు. శక్తి కూడదీసుకుని ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు.
అరెస్టు చేసిన పాకిస్తానీ నేరస్థులను కూడా ఇక్కడ జైలుకు పంపించలేదని, కానీ తనను మాత్రం జైలుకు పంపించారని, ఏ నేరం కూడా చేయనప్పటికీ తనను జైలుకు పంపించారని, దానికి తాను కన్నీరు కార్చడం లేదని, ఈ సవాళ్లను తాను ధైర్యంగా ఎదుర్కుంటానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications