ముంబై రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల పడిగాపులు

హార్బర్ లైన్ రైళ్లపై కూడా ప్రభావం పడినట్లు ఆయన చెప్పారు. బుధవారం కేవలం 70 శాతం సబర్బన్ సర్వీసులు మాత్రమే నడుస్తాయని అధికారులు చెబుతున్నారు. పూణే, మన్మాడ్ నుంచి వచ్చే దూర ప్రాంతాలకు చెందిన నాలుగు రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.
కుర్లా, విద్యావిహార్ స్టేషన్ల మధ్య క్యాబిన్ సిగ్నల్‌లో అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. సిగ్నలింగ్ గేర్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఫైర్ బ్రిగేడ్ అధికారులు రంగప్రవేశం చేసి అర గంటలో మంటలను అదుపు చేశారు. రైళ్లను తెల్లవారు జామున మూడున్నర గంటల ప్రాంతంలో పాక్షికంగా పునరుద్ధరించారు. అయితే అరగంట ఆలస్యంగా నడుస్తున్నాయి.
పశ్చిమ లైన్‌లోని మహిం - చర్చిగేట్ మార్గంలో సీజన్ పాస్‌లను సిఆర్ సబర్బన్ ప్రయాణికులు వాడుకోవడానికి అనుమతిచ్చారు. కల్యాణ్, కాసార రైళ్లలో సిఎస్‌టి వరకు దూర ప్రాంతాల రైళ్లలో ప్రయాణించడానికి సిఆర్ సబర్బన్ ప్రయాణికులను అనుమతిస్తున్నారు.












Click it and Unblock the Notifications