మందు ప్రియులకు దెబ్బ: జానీ వాకర్ కథ ముగిసింది

కర్మాగారాన్ని మూయకూడదని డీయాగియోకు నచ్చజెప్పడానికి స్కాటిష్ ప్రధాని అలెక్స్ సాల్మాండ్ నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. జానీ వారక్ కర్మాగారాన్ని మూసేస్తామని కంపెనీ 2009లోనే ప్రకటించింది. ఇందులో 700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 430 మంది నష్టపరిహారంతో బయటకు వెళ్లడానికి అంగీకరించారు. మరో 200 మందిని ఇతర ఉద్యోగాల్లో నియమించుకుంటున్నారు. 82 మందిని తొలగించారు.
చారిత్రాత్మకమైన జానీ వాకర్ చివరి సీసాను మ్యూజియంలో భద్రపరుస్తారు. వాకర్‌కు చెందిన కిల్మాన్‌రాక్ విస్కీ సీసాను 1820లో మొదటిసారి విక్రయించారు. జానీ వాకర్ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ అవుతున్న అత్యంత ప్రాచుర్యం పొందిన బ్లెండెడ్ స్కాచ్ విస్కీ. ఏడాదికి 130 మిలియన్ సీసాలు అమ్ముడవుతూ వస్తున్నాయి.












Click it and Unblock the Notifications