నాతో జగన్ పార్టీలోకి ఎవరొస్తారో చెబుతా: వంగవీటి రాధా

Vangaveeti Radhakrishna
విజయవాడ: తనతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చే శాసనసభ్యులు, కార్పోరేటర్ల పేర్లు త్వరలో చెబుతానని విజయవాడకు చెందిన సీనియర్ రాజకీయ నేత, మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ గురువారం మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. తాను ఈ నెల 27వ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. రాధా-రంగా మిత్రమండలి సూచనల మేరకే తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.

తాను పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. కాంగ్రెసు పార్టీ కోసం ప్రాణత్యాగాలు చేసిన జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, తన తండ్రి స్వర్గీయ వంగవీటి రంగాలపై కాంగ్రెసు నేతలు ఇప్పుడు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రంగా ఆశయ సాధన కోసం తాను ఆయన విగ్రహం సాక్షిగా జగన్ సమక్షంలో పార్టీలో చేరతానని చెప్పారు. తాను కొన్ని సందర్భాలలో జగన్‌ను కలిసి మాట్లాడానని చెప్పారు. అంతిమంగా చేరితేనే బాగుంటుందని ఓ అభిప్రాయానికి వచ్చినట్టు చెప్పారు. జగన్, ఆయన కుటుంబంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు.

తాను ఎక్కడ నుండి పోటీ చేయాలనేది పార్టీ అధ్యక్షుడిగా జగన్ నిర్ణయిస్తారని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలో జగన్ పైన విమర్శలు చేస్తున్నాయన్నారు. తమ కుటుంబం 1984 నుండి కాంగ్రెసులోనే ఉందన్నారు. అయినా తన తండ్రి త్యాగాలకు ఆ పార్టీ విలువ ఇవ్వలేదన్నారు. రంగా అభిమానులకు గుర్తింపు ఇస్తానని జగన్ చెప్పడంతోనే తాను ఆ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+