శరద్ పవార్, వాయలార్‌ని విజయసాయిరెడ్డి కలిశారా?

దీంతో విజయ సాయి వారిని కలిసేందుకే వెళ్లారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ ఆస్తుల కేసులో ఎ-2గా ఉన్న విజయ సాయి రెడ్డి కాంగ్రెసు నేతలు, కేంద్ర మంత్రి బస చేసిన తాజ్ కృష్ణ హోటల్‌కు వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. శుక్రవారం వేకువజామునే అక్కడకు వెళ్లడం వెనుక లాలూచీ ఏమిటో చెప్పాలని టిడిపి నేతలు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ డిమాండ్ చేశారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని మంచివాడు అన్న వాయలార్ రవి వ్యాఖ్యలను కూడా టిడిపి తప్పు పట్టింది. వైయస్ మంచి, జగన్ దొంగ అంటే ఎలా అని ప్రశ్నించారు. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఢిల్లీ వెళ్లిన తర్వాతే ఆయన ఆస్తుల కేసులో సిబిఐ దర్యాఫ్తులో వేగం తగ్గిందని టిడిపి నేతలు ఇప్పటికే ఆరోపిస్తున్నారు.
హైకోర్టు జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తునకు ఆదేశించిన తర్వాత కేసు వేగంగా ఉందన్నారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిశారని, తాను కాంగ్రెసుకు మద్దతు పలుకుతానని ప్రధానికి హామీ ఇచ్చారని, అందువల్లే సిబిఐ దర్యాఫ్తులో వేగం తగ్గిందని విమర్శించారు. అయితే ఆ వాదనలు వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలు ఖండించాయి.
అందుకు ధీటుగా వైయస్సార్ కాంగ్రెసు కూడా చంద్రబాబు దొంగచాటుగా హోంమంత్రి చిదంబరాన్ని కలిశారని ఎదురుదాడికి దిగింది. వాటిని టిడిపి ఖండించింది. అయితే తాజాగా శరద్ పవార్, వాయలార్ రవి ఉన్న హోటల్‌కు విజయ సాయి రెడ్డి వెళ్లడంపై తెలుగుదేశం పార్టీ మరోసారి అనుమానాలు వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications