సిఎం మార్పు ఉండదు, తెలంగాణపై కాదు: కృష్ణమూర్తి

తెలంగాణ సమస్య పరిష్కారం కోసం తాను హైదరాబాదు రాలేదని, తెలంగాణ సమస్యను పార్టీ అధిష్టానం త్వరలో పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు. తాము రాష్ట్ర పార్టీ వ్యవహారాలను సమన్వయ పరచడానికి మాత్రమే వచ్చామని, రాష్ట్ర వ్యవహారాలపై అధిష్టానం దృష్టి పెట్టడం తప్పుకాదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని నాయకత్వ మార్పు తమ పరిధిలో లేదని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యవహారాలపై నివేదికలు రూపొందించి, సోనియా గాంధీకి సమర్పించామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో పార్టీ పటిష్టంగానే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ పదవులను, నామినేటెడ్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో వైయస్ రాజశేఖర రెడ్డి ఫొటో పెట్టుకోవాలా, వద్దా అనే విషయంపై పబ్లిసిటీ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. కెబి కృష్ణమూర్తి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సమావేశమయ్యారు.
వాయలార్ రవి రావడానికి ముందు కెబి కృష్ణమూర్తి హైదరాబాదుకు వచ్చి పార్టీ నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆ తర్వాత నివేదిక రూపొందించి, సోనియా గాంధీకి సమర్పించారు. ఆయన తిరిగి వెళ్లిన తర్వాత వాయలార్ రవి హైదరాబాదు వచ్చారు. దీన్నిబట్టి రాష్ట్రంలో ఎవరో ఒకరు ఎఐసిసి ప్రతినిధి ఉండేలా సోనియా గాంధీ ఏర్పాట్లు చేస్తున్నట్లు అర్థమవుతోందని అంటున్నారు. ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇదే పద్ధతి కొనసాగవచ్చునని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications