సింగనమల రమేష్‌తో లింక్‌ను అంగీకరించిన భాను?

Singanamala Ramesh
హైదరాబాద్: తాను చేసిన సెటిల్మెంట్లలో తెలుగు సినీ నిర్మాత సింగనమల రమేష్ కూడా ఉన్నారని మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధన నిందితుడు భాను కిరణ్ చెప్పినట్లు ప్రముఖ తెలుగు టీవీ న్యూస్ చానెల్ ఎన్టీవీ ఓ వార్తాకథన్నాన్ని ప్రసారం చేసింది. భాను కిరణ్ సిఐడికి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్ తమ ఉందని చెబుతూ ఈ వార్తాకథనాన్ని ఆ న్యూస్ చానెల్ ప్రసారం చేసింది. భాను కిరణ్‌ను 15 రోజుల పాటు తమ కస్డడీకి అప్పగించాలని సిఐడి సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ రేపటికి వాయిదా పడింది.

ఎన్టీవి ప్రసారం చేసిన వార్తాకథనం ప్రకారం - మరో తెలుగు సినీ నిర్మాత 30 లిటిగేషన్ వ్యవహారాలను తనతో సెటిల్ చేయించుకున్నట్లు భాను కిరణ్ చెప్పాడు. తాను 800 కోట్ల రూపాయల బినామీ ఆస్తులను కూడబెట్టినట్లు అతను తెలిపాడు. హైదరాబాదు, దాని పరిసరాల్లోని రాయదుర్గం, నార్సింగి, మియాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో భూముల సెటిల్మెంట్లు చేసినట్లు ఆతను తెలిపాడు.

భూముల వివరాలు తనకు స్థానిక అధికారులు అందించేవారని అతను చెప్పాడు. ల్యాండ్ సెటిల్మెంట్లకు స్థానిక పోలీసులు సహకరించినట్లు అతను ఆరోపించాడు. తనకు ఇద్దరు ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు తనకు సహకరించారని అతను అంగీకరించాడు. పై అధికారులతో వారికి ఫోన్లు చేయించేవాడినని చెప్పాడు. అందుకు వారికి పెద్ద మొత్తంలో నగదు, అమ్మాయిలను సరఫరా చేసేవాడినని భాను కిరణ్ చెప్పాడు.

మద్దెలచెర్వు సూరిని హత్య చేసి పారిపోయిన తర్వాత భాను కిరణ్‌తో కళ్యాణ్, సింగనమల రమేష్ సంబంధాలపై పలు వార్తాకథనాలు వచ్చాయి. వారిద్దరి అరెస్టు కూడా జరిగింది. సినిమా రంగంలో భాను కిరణ్ తెరచాటున ఉండి భారీగా పెట్టుబడులు పెట్టినట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ స్థితిలో సిఐడి అధికారులు భాను కిరణ్‌ను తమ కస్టడీలోకి తీసుకుని మరింత సమాచారం రాబట్టాలని అనుకుంటున్నారు. మీడియా ముందు ప్రవేశపెట్టడానికి ముందు భాను కిరణ్‌ను సిఐడి అధికారులు విచారించారు. జహీరాబాద్ నుంచి హైదరాబాదుకు తరలించే లోపు కూడా ప్రశ్నించినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+