కదిలేది లేదు: రోడ్డుపై చంద్రబాబు బైఠాయింపు

Chandrababu Naidu
విజయనగరం: పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా తాను చేపట్టదలిచిన ధర్నాకు అనుమతి ఇచ్చే వరకు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కదిలేది లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పట్టుబడుతున్నారు. నాలుగు రోజులైనా ఇక్కడే ఉంటానని ఆయన చెప్పారు. రాత్రి కూడా ఇక్కడే ఉంటానని ఆయన చెప్పారు. అనుమతి నిరాకరణపై ఆయన పోలీసు అధికారుల మీద సోమవారం తీవ్రంగా మండిపడ్డారు.

ప్రజాస్వామ్య బద్ధంగా ధర్నా చేస్తే మీకున్న అభ్యంతరమేమిటని ఆయన పోలీసు అధికారులను ప్రశ్నించారు. ధర్నాకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆయన ఎస్పీ కార్తికేయపై మండిపడ్డారు. తాను కదిలేది లేదంటూ చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ కార్యాలయం జంక్షన్‌లో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడానికి కూడా చంద్రబాబుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో చంద్రబాబు మరింతగా ఆగ్రహించారు.

ధర్నాకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆయన అడిగారు. తన పాలనలో పోలీసులను తాను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని ఆయన చెప్పారు. తన పోరాటం పోలీసుల మీద కాదని, ప్రభుత్వం మీద అని ఆయన చెప్పారు. ఎస్పరీ కాంగ్రెసు కాంగ్రెసు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తమ పార్టీని అణచివేసేందుకు ప్రయత్నిస్తే రెచ్చిపోతామని ఆయన అన్నారు. విజయనగరం జిల్లా మద్యం సిండికేట్లపై చర్య తీసుకునే వరకు వదిలేది లేదని ఆయన అన్నారు.

తాము క్రమశిక్షణతో ఉన్నామని, పద్ధతి ప్రకారం నడుస్తున్నామని చంద్రబాబు చెప్పారు. అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ విగ్రహం వద్దకు తమను అనుమతించాలని, తమను అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు. ఇష్టప్రకారం లూటీ చేస్తాం, ఎవరూ అడుగొద్దనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. బొత్స సత్యనారాయణ ఇంటి వద్ద ధర్నాకు దిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడానికి అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్లకు వ్యతిరేకంగా విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చంద్రబాబు తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినా ధర్నా చేసేందుకే చంద్రబాబు నిర్ణయించుకుని విజయనగరం వచ్చారు. చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనికితోడు కాంగ్రెసు పార్టీ పోటీ ధర్నాకు దిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+