పంతం నెగ్గించుకున్న బాబు: ఎన్టీఆర్‌కు నివాళులు

ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్న చంద్రబాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా ధర్నా చేపడితే పోలీసులు అడ్డుకున్నారని ఆయన అన్నారు. అనేక ఇబ్బందులు కలిగించారని ఆయన అన్నారు. తమ పార్టీ నాయకుడు అశోక్ గజపతి రాజుకు కూడా ఆగ్రహం వచ్చిందని, అశోక్ గజపతి రాజు తలుచుకుంటే బొత్స సత్యనారాయణ విజయనగరంలో ఉంటారా అని ఆయన అన్నారు.
మద్యం సిండికేట్లకు వ్యతిరేకంగా తాము తలపెట్టిన ధర్నాకు అనుమతి ఇచ్చే వరకు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కదిలేది లేదని నారా చంద్రబాబు నాయుడు అంతకు ముందు పట్టబట్టారు. నాలుగు రోజులైనా ఇక్కడే ఉంటానని ఆయన చెప్పారు. రాత్రి కూడా ఇక్కడే ఉంటానని ఆయన చెప్పారు. రోడ్డుపైన బైఠాయించారు.
ప్రజాస్వామ్య బద్ధంగా ధర్నా చేస్తే మీకున్న అభ్యంతరమేమిటని ఆయన పోలీసు అధికారులను ప్రశ్నించారు. ధర్నాకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆయన ఎస్పీ కార్తికేయపై మండిపడ్డారు. తాను కదిలేది లేదంటూ చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ కార్యాలయం జంక్షన్‌లో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడానికి కూడా చంద్రబాబుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో చంద్రబాబు మరింతగా ఆగ్రహించారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications