హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ బైపోల్స్ వ్యూహం: కృష్ణం రాజుతో చిరంజీవికి చెక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan-Krishnam Raju-Chiranjeevi
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికలలో ఓ వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో అత్యంత ప్రజాధరణ కలిగిన రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవిని ఎదుర్కొనేందుకు జగన్ ప్రముఖ నటుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు కృష్ణం రాజును రంగంలోకి దింపుతున్నారని అంటున్నారు.

కృష్ణం రాజు త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఉదయం కాకినాడ, నర్సాపురం నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమావేశమయ్యారు. వైయస్సార్ కాంగ్రెసులో చేరనున్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. కృష్ణం రాజుది చిరంజీవి సొంత గ్రామమైన మొగల్తూరే.

గోదావరి జిల్లాలో చిరంజీవికి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో కృష్ణంరాజుకు అంతే ఫాలోయింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ చిరు హవాను ధాటిగా ఎదుర్కొనేందుకే జగన్ ఈ రెబెల్ స్టార్‌ని రంగంలోకి దించారని అంటున్నారు. ఇప్పటికిప్పుడు కృష్ణం రాజు వైయస్సార్సీలో చేరితే ఉప ఎన్నికలలో ఆ ప్రభావం జగన్ పార్టీకి లబ్ధి చేకూరుస్తుందని భావిస్తున్నారు.

ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికలలోనూ గోదావరి జిల్లాల్లో చిరు దూకుడుకు అడ్డుకట్ట వేయగలిగేది కృష్ణంరాజే అని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. పార్టీలోనూ ఆయనకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అంశంపై జగన్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికలలో కృష్ణంరాజు కోరిన స్థానం ఇవ్వడంతో పాటు ఆయనకు పార్టీలో ప్రత్యేక స్థానం ఇవ్వాలని భావిస్తున్నారని అంటున్నారు.

English summary
YSR Congress Party chief and Kadapa Parliament Member YS Jaganmohan Reddy is thinking to check Rajya Sabha Member Chiranjeevi in Godavari district with well known actor and former MP Krishnam Raju. Krishnam Raju will joining in Jagan party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X