ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ నిజంగా రైతు వ్యతిరేకేనేమే!?: జగన్ కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఏలూరు/వరంగల్: దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని దళిత వ్యతిరేకిగా కాంగ్రెసు నేతలు పేర్కొనడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం మండిపడ్డారు. వైయస్ వల్లే రాష్ట్రంలో కాంగ్రెసు రెండుసార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెసు పార్టీని కేంద్ర, రాష్ట్రాలలో అధికారంలోకి తీసుకు వచ్చిన వైయస్‌ను రైతు, దళిత, పేదల వ్యతిరేకి అని చెప్పడం దారుణమన్నారు.

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కైన కాంగ్రెసు వైయస్ పైన ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. దళితులు, రైతులు అందరీకి సరియైన న్యాయం చేసింది వైయస్సే అన్నారు. టిడిపి, కాంగ్రెసులు కుమ్మక్కై ఆర్టీఐ కమిషనర్ల పదవులు పంచుకున్నాయని మండిపడ్డారు. ఎమ్మార్ విషయంలో చంద్రబాబును సిబిఐ ఎందుకు విచారించడం లేదని ఆయన ప్రశ్నించారు.

మరణించినా ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోవాలి అని ఆలోచించాల్సిన ప్రభుత్వ పెద్దలు ప్రజా సమస్యలను గాలి కొదిలేస్తున్నారని ఆయన కొయ్యలగూడెం ప్రచారంలో కాంగ్రెసుపై నిప్పులు చెరిగారు. వైయస్ మృతి చెంది రెండేళ్లు దాటినా ఆయనపై బురదజల్లే ప్రయత్నాలు కాంగ్రెసు పెద్దలు చేస్తున్నారని విమర్శించారు.

వైయస్‌ను తిట్టేందుకు కేబినెట్ భేటీ కూడా పెట్టుకోవడం చూస్తుంటే చాలా బాధేస్తుందన్నారు. వైయస్ ఎలాగూ తిరిగి వచ్చి సమాధానం చెప్పలేరన్న ధైర్యంతో కాంగ్రెసు, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కై ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వారు చెప్పినట్లు వైయస్ నిజంగానే రైతు వ్యతిరేకేనేమో అందుకే వరికి మద్దతు ధర పెంచాలని ఆయన తపించారని ఎద్దేవా చేశారు.

తాను ముఖ్యమంత్రి అయి కాగానే వరికి మద్దతు ధరను ఏకంగా దాదాపు రెండింతలు చేశారన్నారు. సిఎం అయిన తొలినాడే రైతుల కోసం విద్యుత్ బకాయిలు మాఫీ చేశారన్నారు. అటువంటి వైయస్‌ను రైతు వ్యతిరేకి అనడం శోచనీయం అన్నారు. పోలవరం ప్రాజెక్టు వైపు చూస్తే వైయస్సే గుర్తుకు వస్తాడన్నారు. పైనున్న దేవుడు చూస్తున్నాడని కాంగ్రెసు, టిడిపిలకు ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటోతోనే తాము ఉప ఎన్నికలకు వెళతామని మాజీ మంత్రి కొండా సురేఖ వరంగల్‌లో చెప్పారు. ప్యాన్ గుర్తుతోనే ఎన్నికలకు వెళతామని చెప్పారు. ప్రతి ఉప ఎన్నికల తర్వాత తెలంగాణ వస్తోందని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ పేరుతో టిఆర్ఎస్ పబ్బం గడుపుకుంటోందని కొండా సురేఖ ఆరోపించారు.

English summary

 YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy countered Congress Party's comments against late YS Rajasekhar Reddy. He was alleged, Telugudesam and Congress allied to target YS Rajasekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X