అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంగళి కృష్ణ నిందితుడే: సూట్‌కేస్ బాంబ్ కేసులో కోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mangali Krishna
అనంతపురం: సూటు కేసు బాంబు కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అనుచరుడిగా ముద్రపడిన మంగళి కృష్ణను నిందితుడిగా పేర్కొంటూ అనంతపురం కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. మంగళి కృష్ణతో పాటు మరో ముగ్గురిని కోర్టు నిందితులుగా పేర్కొంది. సూటు కేసు బాంబు కేసులో మంగళి కృష్ణను కస్టడీకి తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

ఈ కేసులో మంగళి కృష్ణ బుధవారం కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణ అనుచరులు అక్కడకు భారీగా తరలి వచ్చారు. దీంతో కోర్టు వద్ద, అనంతపురంలో భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. బుధవారం తుది తీర్పు కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీంతో అనంతలో హైటెన్షన్ ఏర్పడింది.

కాగా 2001లో మాజీ మంత్రి, దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవిని చంపేందుకు సూటు కేసు బాంబు ప్రయోగించారని మంగళి కృష్ణపై అభియోగం. ఇన్నాళ్లుగా ఈ కేసు నడిచింది. కేసులో వాదనలు విన్న కోర్టు బుధవారం అంతిమ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 14మందిని నిందితులుగా పేర్కొన్నారు.

విచారణ సమయంలోనే నలుగురు నిందితులు మృతి చెందారు. మరో ఆరుగురిపై సాక్ష్యాధారాలు లేనందున వారి పేర్లు కొట్టి వేసింది. మిగిలిన నలుగురికి శిక్ష పడింది. నిందితుల్లో మంగళి కృష్ణతో పాటు రాంచంద్రా రెడ్డి, మధుసూధన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా నిందితులకు శిక్షను మరికాసేపట్లో కోర్టు ఖరారు చేయనుంది.

English summary
Ananthapur district court gave judgement on wednesday in suitcase bomb case which is took place in 2001. Court confirmed Mangali Krishna and other three are accused in suit case bomb case. Court ordered police to take custody them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X