విశాఖను చూసి నెల్లూరువాసుల ఓటు: సుబ్బిరామిరెడ్డి

విశాఖపట్నం, నెల్లూరు తనకు రెండు కళ్లలాంటివని చెప్పారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేయడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. విశాఖను ఎలా చేసానో నెల్లూరును అలాగే అభివృద్ధి చేస్తానని చెప్పారు. నెల్లూరులో గెలిచినా తాను విశాఖకు సేవలు అందిస్తానని చెప్పారు.
తాను మే 18వ తారీఖు నుండి ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు. ఉప ఎన్నికలలో గెలుస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆదేశించడంతో టి.సుబ్బిరామి రెడ్డి నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డిపై పైచేయి సాధించేందుకు ఆయన ఉవ్వీళ్లూరుతున్నారు.
కాగా త్వరలో రాష్ట్రంలోని పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ఖరారయ్యారు. తెలుగుదేశం పార్టీ కూడా దాదాపు అన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రచారంలో జగన్, చంద్రబాబు దూసుకు వెళుతున్నారు. కాంగ్రెసు మాత్రం ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉంది.












Click it and Unblock the Notifications