వైయస్ విగ్రహాలకు ముసుగు, నోకామెంట్ అన్న బాబు

పక్కనే ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాలకు మాత్రం ముసుగులు వేయకుండా వైయస్ విగ్రహానికి వేయడమేమిటని వారు అధికారులను ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌ను కలిసి తమ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ముసుగు తొలగించాలని డిమాండ్ చేశారు.
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ముసుగు వేసిన విషయం తనకు తెలియదని ప్రసాద్ చెప్పారు. సిబ్బంది కొరత వల్లే కొన్ని విగ్రహాలకు ముసుగు వేసినట్లున్నారని, అన్ని విగ్రహాలకు ముసుగులు వేస్తామని చెప్పారు. కాగా రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయడంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నో కామెంట్ అన్నారు.
కాగా మూడు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలును విడుదల చేసిన విషయం తెలిసిందే. షెడ్యూలు ప్రకటించినప్పటి నుండే ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుంది. ఇందులో భాగంగానే వైయస్ విగ్రహానికి ముసుగు వేశారని, కానీ ఎన్టీఆర్, రాజీవ్ విగ్రహాలకు వేయకపోవడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి పోటీ చేసే అవకాశముంది.












Click it and Unblock the Notifications