భాను కిరణ్ స్వల్ప అస్వస్థత, ఉస్మానియాకు తరలింపు

భాను కిరణ్‌ను సిఐడి పోలీసులు బుధవారం నుండి విచారిస్తున్నారు. మద్దెలచెర్వు సూరి హత్యతో పాటు భూకబ్జాలు, దందాలు, బెదిరింపులు తదితర అన్ని ఆరోపణల పైనా భాను నుండి విచారణలో ఆరా తీస్తున్నారు. భాను కిరణ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి పోలీసులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు బుధవారం నుండి తొమ్మిది రోజుల కస్టడీకి అప్పగించింది.
బుధ, గురు రెండు రోజుల సిఐడి విచారణలో భాను ఎన్ని విషయాలు చెప్పారని తెలుస్తోంది. భాను మరెందరో పెద్దలతో కలిసి సెటిల్మెంట్లు చేసినట్లు సిఐడి అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. భాను కిరణ్ చెప్పిన వివరాల ప్రకారం సిఐడి అధికారులు ఓ జాబితా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. భాను చెప్పిన వివరాల ప్రకారం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో సోదాలు నిర్వహించిన పోలీసులు నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
సూరి పేరు చెప్పుకొని భాను అనేక సెటిల్మెంట్లు పాల్పడ్డాడట. సూరితో కలిసి కొన్ని, అతనికి తెలియకుండా కొన్ని సెటిల్మెంట్లు చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకొన్ని సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలతో కలిసి చేశారని సమాచారం. సినీ నిర్మాతలు సి.కల్యాణ్, శింగనమల రమేష్‌లు భానుతో కలిసి సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీరితో పాటు భాను జాబితా మరింత పెద్దగా ఉందని విచారణలో సిఐడి అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
మంగళి కృష్ణతో తనకు పరిచయం ఉందని, పన్నెండేళ్లుగా అతను తెలిసని విచారణలో చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మంగళి కృష్ణే తనకు ఆయుధాలు ఇచ్చారని కూడా విచారణలో చెప్పాడట. సినీ పరిశ్రమకు చెందిన మరికొందరితో పాటు కొందరు రాజకీయ నాయకులతోనూ కలిసి భాను సెటిల్మెంట్లు చేశాడట.












Click it and Unblock the Notifications