హెల్ప్ ప్లీజ్!: తిరుపతి టిక్కెట్ కోసం చిరు ఇంటికి గల్లా

చిరంజీవి ఉదయమే న్యూఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చారు. ఆయన తిరుపతి అభ్యర్థిగా అధిష్టానం వద్ద వెంకట రమణ పేరును ప్రతిపాదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. జయదేవ్‌కు టిక్కెట్ ఇప్పించేందుకు చిరు సుముఖంగా లేరనే వార్తలు గతంలోనే వచ్చాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వెంకట రమణ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు ఆయన పేరు ఖరారు అయిపోయిందని, ప్రకటించడమే తరువాయి అంటున్నారు.
ఈ నేపథ్యంలో చివరి ప్రయత్నంగా గల్లా అరుణ కుమారి తన తనయుడి కోసం చిరును కలిశారు. తన తనయుడికి సీటు ఇస్తే ఎలా గెలుస్తాడో పూర్తి సర్వే వివరాలు చిరుకు వారు వివరించినట్లుగా తెలుస్తోంది. అయితే చిరంజీవి కూడా జయదేవ్ పేరును కూడా తాను అధిష్టానం దృష్టికి తీసుకు వెళతానని గల్లా అరుణకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆమె మాత్రం జయదేవ్ పేరు మాత్రమే సూచించాలని చెప్పారని అంటున్నారు.
కాగా తిరుపతి సీటు కాంగ్రెసు గెలిచే స్థానంగా అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ నుండి పోటీకి మాజీ ఎమ్మెల్యే వెంకట రమణ, గల్లా జయదేవ్ రేసులో ఉన్నారు. కాంగ్రెసు పార్టీ చేసిన సర్వేలో గల్లా జయదేవ్ కంటే వెంకట రమణకు టిక్కెట్ ఇస్తేనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలసిందని అంటున్నారు. కిరణ్, చిరులు కూడా ఆయనకే మద్దతు ఇస్తున్నారు. దీంతో అధిష్టానం వెంకట రమణ వైపే మొగ్గు చూపిందని అంటున్నారు. అయితే అరుణ మాత్రం తన మగనం ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
