దేశంలో దొంగలు పడ్డారు, జగన్ కొత్త బిచ్చగాడు: బాబు

Chandrababu Naidu
కడప: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు ఉచిత బియ్యం ఇస్తామని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం కడప జిల్లా రాజంపేట రోడ్డు షోలో అన్నారు. ఆయన రాజంపేటలో మూడో రోజు తన ఉప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వృద్ధాప్య పింఛన్ రూ.500, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.1000 ఇస్తామని ప్రకటించారు. రైతులకు ఏడు గంటలు కాకుండా తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు.

పులివెందుల కృష్ణ లాంటి హంతకులను ప్రోత్సహించి జగన్ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు సంపాదించారని ఆరోపించారు.

జగన్ సిఎం అయితే దొంగలు, దోపిడిదారులే మంత్రులు అవుతారన్నారు. మంగళి కృష్ణకు హోంశాఖ, గనుల శాఖకు గాలి జనార్ధన్ రెడ్డిని, ఆర్థికశాఖకు విజయ సాయి రెడ్డిని మంత్రులుగా చేస్తారన్నారు. బిజెపి నేత బంగారు లక్ష్మణ్ రూ.లక్ష తీసుకుంటే నాలుగేళ్లు జైలు శిక్ష విధించి తీహార్ జైలుకు పంపించారన్నారు. కానీ కోట్లు దోచుకున్న జగన్ మాత్రం ఓదార్పు యాత్ర అంటూ తిరుగుతున్నారన్నారు.

తనకు ఎవరి పైనా వ్యక్తిగతంగా కోపం, బాధ లేదన్నారు. కానీ అవినీతి చేసిన వారు మాత్రం బయట ఉండటం సరికాదన్నారు. అవినీతిపరులు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు. దేశంలో దొంగలు పడ్డారని అన్నారు. వైయస్ జగన్ కొత్త బిచ్చగాడన్నారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకున్న కోట్లు చాలవని మళ్లీ అధికారం కావాలంటున్నాడని విమర్శించారు.

మరోవైపు రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కనిపించడం లేదా అని హైదరాబాదులో టిడిపి నేతలు రావుల చంద్రశేఖర రెడ్డి, రాములు ప్రశ్నించారు. కాంగ్రెసేతర కర్నాటక కరవు ప్రాంతంలో పర్యటించిన సోనియా పక్కనే ఉన్న ఎపిలో ఎందుకు పర్యటించడం లేదన్నారు.

కరవు గురించి రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు కేంద్రం దృష్టికి సరిగా తీసుకు వెళ్లడం లేదని మండిపడ్డారు. ఢిల్లీ నుంచి పెద్దలు వస్తున్నా ఇక్కడ ప్రజలకు ఒరిగేదేం లేదని వారు అన్నారు. కేంద్రం నుంచి వచ్చే మంత్రులు పులకరింతలు, పలకరింతలతో సరిపెడుతున్నారన్నారు. ప్రజల గురించి మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+