Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎట్టకేలకు మావోల చెర నుండి కలెక్టర్ పాల్ విడుదల

Alex Paul Menon
రాయపూర్: మావోల చెర నుంచి చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్ గురువారం మధ్యాహ్నం విడుదలయ్యారు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్యవర్తులుగా వ్యవహరించిన బిడి శర్మ, ప్రొఫెసర్ హరగోపాల్‌కు కలెక్టర్ మీనన్‌ను మావోయిస్టులు తాడిమెట్ల అడవులలో అప్పగించారు. మధ్యవర్తులు కలెక్టర్‌ను వెంట బెట్టుకొని తిరుగు ప్రయాణమయ్యారు.

కాగా గత నెల ఏప్రిల్ 21వ తేదిన కలెక్టర్ అలెక్స్ మీనన్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అతనిని విడుదల చేయించడానికి బిడి శర్మ, హరగోపాల్ మధ్యవర్తులుగా వ్యవహరించారు. వారి కృషి ఫలించింది. వీరు నాలుగు దఫాలుగా అటు ప్రభుత్వం, ఇటు మావోయిస్టులతో చర్చలు జరిపారు.

మావోయిస్టుల చెరలో మీనన్ పదమూడు రోజులు ఉన్నారు. మధ్యవర్తులు ఇద్దరూ హెలికాప్టర్ ద్వారా సుకుమా జిల్లాలోని చింతల్నార్ గ్రామానికి చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గాన తాడిమెట్లకు చేరుకున్నారు. అస్తమాతో బాధపడుతున్న అలెక్స్ పాల్‌కు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉండాలని సుకుమా, దంతేవాడ, జగ్గల్ పూర్, రాయపూర్ జిల్లాలోని వైద్య అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చింతల్నార్ వద్ద అంబులెన్స్ ను సిద్ధంగా ఉంచారు.

కాగా అలెక్స్ విడుదలపై ఆయన సతీమణి, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కాగా కలెక్టర్ విడుదలకు మావోయిస్టులు పెట్టిన పలు ఒప్పందాలకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఆయనను విడుదల చేశారు. కాగా రాయపూర్‌కు ఐదువందల కిలోమీటర్ల దూరంలోని అడవులలో మధ్యాహ్నం 3.45 గంటల ప్రాంతంలో కలెక్టర్‌ను విడుదల చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+