ఎన్ని స్థానాల్లో గెలుస్తాం?: ఎంపీలతో సోనియా గాంధీ

కావూరి ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, సమీకరణాలను సోనియాకు వివరించారు. కష్టపడి పనిచేసినా కూడా అయిదారు సీట్ల కంటే ఎక్కువ గెలుచుకోలేమని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. పలు స్థానాల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంటుందని కూడా ఆయన వివరించినట్లు సమాచారం. పనబాక లక్ష్మి, అనంత వెంకట్రామి రెడ్డి, సాయి ప్రతాప్ కూడా రాజకీయ పరిస్థితిని, తమ అంచనాలను సోనియాకు వివరించారు.
గత రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ నేతలు పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదని, పార్టీని పునర్వ్యవస్థీకరించలేదని మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా ఓదార్పు, ధర్నాలు, ఆందోళనలతో ప్రజల్లో వెళుతున్నారని వారు సోనియాకు చెప్పారని తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమం, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అనుయాయుల్లో అయోమయం, ప్రత్యామ్నాయ పథకాలతో పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లకపోవడం ఇలా తదితర కారణాలు పార్టీ పరిస్థితిని దెబ్బతీస్తున్నాయని వారు సోనియాకు చెప్పారని తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికలను ఆధారంగా తీసుకుని పార్టీని పునర్వ్యవస్థీకరించి ఇప్పటి నుంచైనా జనంలోకి వెళ్లి ప్రభుత్వ ప్రతిష్ఠ మెరుగుపడేలా చూడాలని సోనియాకు వారు చెప్పినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications