హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భాను కిరణ్ వ్యవహారంపై స్పందించిన పొన్నాల

By Pratap
|
Google Oneindia TeluguNews

Ponnala Laxmaiah
హైదరాబాద్: హంద్రీనీవా లో 178 కోట్ల రూపాయల ప్రాజెక్టును ఎల్‌ వన్ కాంట్రాక్టర్లను మద్దెలచెర్వలు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ బెదిరించి కెవిఎన్ రెడ్డి అనే కాంట్రాక్టర్‌కు ప్రాజెక్టు దక్కేలా చేశాడనే ఆరోపణలపై ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్యయ్య స్పందించారు. హంద్రీనీవా ప్రాజెక్టు కాంట్రాక్టు పనులు పారదర్శకంగానే జరిగాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

భాను కిరణ్ డబ్బులు వసూలు చేసిన విషయంపై పూర్తి సమాచారం సేకరిస్తే తెలుస్తుందని ఆయన అన్నారు. ఆ సమయంలో పొన్నాల లక్ష్మయ్య భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అవసరమైతే సమాచారం సేకరిస్తామని ఆయన చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టు కంట్రాక్టర్ల నుంచి భాను కిరణ్ డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.

వరంగల్ జిల్లా పరకాల కాంగ్రెసు అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీలో ఏ విధమైన అంతర్గత పోరు లేదని, అయితే అభిప్రాయభేదాలు మాత్రం ఉన్నాయని ఆయన అన్నారు. పార్టీ విజయానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన చెప్పారు. పరకాల పార్టీ అభ్యర్థి సమ్మారావు కాంగ్రెసు కాంగ్రెసుకు కొత్త కాదని ఆయన చెప్పారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యానికి తెలుగదేశం, బిజెపిల వైఖరే కారణమని ఆయన విమర్శించారు.

పరకాల సీటు కోసం ప్రభుత్వ చీఫ్ విఫ్ గండ్ర వెంకటరమణా రెడ్డి తన భార్య జ్యోతికి ఇప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, సమ్మారావును చివరికి ఖరారు చేశారు. దీంతో గండ్ర వెంకటరమణారెడ్డి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై కూడా విమర్శలు చేశారు. సమ్మారావు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారని, సమ్మారావును పార్టీలో చేర్చుకునేప్పుడు తనకు కనీసం చెప్పలేదని ఆయన అన్నారు.

English summary
IT minister Ponnala Laxmaiah reacted on Bhanu Kiran hand in Handri Neeva contract issue. He said that Handri Neeva cotract works were finalised fairly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X