ప్రియుడిపై దాడి చేసి ప్రియురాలిని ఎత్తుకెళ్లారు

తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. తన కల్లు రాత్రి పూట దొంగిలిస్తున్నారని తెలుసుకున్న ఓ వ్యక్తి కల్లులో విషం కలిపాడు. సోమవారం రాత్రి కల్లు దొంగిలించిన ఆరుగురు వ్యక్తులు దానిని తాగి ఆసుపత్రి పాలయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. కల్లులో విషం కలిపిన యజమాని పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన వెల్ల గ్రామంలో జరిగింది.
హైదరాబాదులో చిన్నారి కిడ్నాప్ అయిన ఘటన కలకలం సృష్టించింది. అంబరుపేట మల్లికార్జున నగర్‌లో అక్షిత అనే చిన్నారి సోమవారం ఇంటి ముందు ఆడుకుంటుండగా చాక్లెట్ ఇస్తానంటూ గుర్తు తెలియని ఓ మహిళ ఈ ఘటనకు పాల్పడినట్లుగా సమాచారం. అడ్డుకున్న ఉదయ్ కుమార్ అనే బాలుడిని సదరు మహిళ గాయపర్చింది.
తమ పాప కనిపించక పోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆక్షితను ఎత్తుకెళ్లినట్లుగా పలువురు స్థానికులు ఓ మహిళపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. తాను కిడ్నాప్ చేయలేదని ఆమె పోలీసులకు చెప్పారు.
కర్నూలు జిల్లా బనగానపల్లిలో లక్ష్మీ రెడ్డి అనే వ్యక్తిపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఆయనపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో లక్ష్మీ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాతకక్షలే ఈ దాడికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!