సోనియా గాంధీకి యడ్డీ కితాబు, కాంగ్రెస్ వైపు చూపు

సమస్యలు ఎదుర్కొంటున్న నేతకు ముందుగా అండగా ఉంటారని, ఆ తర్వాత విచారణ అనంతరం నిర్ణయిస్తారని అన్నారు. కానీ బిజెపి అందుకు విరుద్ధంగా ఉందన్నారు. పార్టీ నేత పైన ఆరోపణలు వస్తే దోషిగా తేలకముందే నీచంగా చూస్తున్నారని మండిపడ్డారు. కాగా నిన్నటి వరకు కొత్త పార్టీ పెట్టాలని యడ్యూరప్పకు సూచించిన కాంగ్రెసు పార్టీ నేతలు ఆదివారం తమ మాట మార్చారు. తాజాగా కాంగ్రెసు పార్టీ నేతలు యడ్డీని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
మరోవైపు తాను, పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీని వీడతారనే ప్రచారంలో వాస్తవం లేదని యడ్యూరప్ప చెప్పారు. ముఖ్యమంత్రి సదానంద గౌడ వ్యవహారంపై వారు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. తమకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అధిష్టానానికి లేఖ రాయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. తనకు క్లోజ్‌గా ఉంటున్నందుకే ఆ నేతలకు వ్యతిరేకంగా సదానంద జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి లేఖ రాశాలని విమర్శించారు.
సదానంద శాసనసభా పక్ష సమావేశం నిర్వహించడం లేదని విమర్శించారు. సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత ఐదు నెలలుగా ఒక్క సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. తాను పార్టీ వీడాలనే నిర్ణయాన్ని తీసుకోలేదని, తన నేతలతో చర్చించిన తర్వాత ఏదైనా ప్రకటిస్తానని చెప్పారు.
మరోవైపు యడ్యూరప్ప వర్గం విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి సదానంద గౌడతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరప్ప భేటీ అయ్యారు. యడ్డీ వర్గం నేతల అంశంపై చర్చించారు. వారిని బుజ్జగించేందుకు సిఎం వర్గం ప్రయత్నించింది. అయితే యడ్డీ వర్గం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ పార్టీ ఎప్పుడూ యడ్డీకి అండగానే ఉంటుందని ఈశ్వరప్ప ఈ సందర్భంగా చెప్పారు.












Click it and Unblock the Notifications