ఇంద్రకీలాద్రిపై మృతదేహం: ప్రమాదంలో సజీవ దహనం

బస్సు అంతటికీ మంటలు వ్యాపించడంతో ప్రయాణీకులు కిటికీ అద్దాలు పగులగొట్టి కిందకు దూకారు. మృతురాలు పశ్చిమ గోదావరి జిల్లా సత్రంపాడుకు చెందిన శారదగా గుర్తించారు. క్షతగాత్రులను హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ బస్సు అంజనీ ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా తెలుస్తోంది. బస్సులో మొత్తం నలభై నాలుగు మంది ప్రయాణీకులు ఉన్నారు. విజయవాడకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడంతో ఎన్‌హెచ్-9పై కొద్ది సేపు భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెంలో నిద్రిస్తున్న వారిపై నుంచి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు. వరంగల్ జిల్లా హసన్‌పర్తి వద్ద ఓ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు.
మరోవైపు కృష్ణా జిల్లా ఇంద్రకీలాద్రిపై ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అన్నదాన సత్రం వాటర్ ట్యాంకులో మృతదేహాన్ని పోలీసులు ఉదయం గుర్తించారు. మూడు రోజుల క్రితమే ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
ఈ మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు రోజులుగా నీరు దుర్వాసన రావడంతో భక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో వెలుగులోకి వచ్చింది. ఇది హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంద్రకీలాద్రిలో మూడు వాటర్ ట్యాంకుల ద్వారా నీరు వస్తుంది. వీటిని తాగడానికి, ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తారు.
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications